Prevention of Unfair Means-2024 : పార్లమెంట్ లో కొత్త బిల్లు.. క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే.. 10 ఏళ్లు జైలు శిక్ష.. కోటీ రూ..జరిమానా.. తస్మాత్ జాగ్రత్త..!

తాజా ఈ సమస్యలకు కేంద్ర చెక్ పెట్టబోతుంది. పోటీ పరీక్షలు జరిగినప్పుడు ప్రశ్నపత్రాలు లీక్‌ (Quotation Paper Leak) చేసి డబ్బులు దండుకునే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 6, 2024 | 10:18 AMLast Updated on: Feb 06, 2024 | 10:18 AM

New Bill In Parliament If Question Paper Is Leaked 10 Years Imprisonment Rs Crore Fine Tasmat Beware

 

 

పరీక్షలు అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది.. చిన్నప్పుడు స్కూల్ లో రాసే గ్ణపకాలు గుర్తుకు వస్తాయి. మరి పోటీ పరీక్షలు అంటే లీకేజీలు గుర్తుకు వస్తాయి అని చెప్పాలి. అదే లేండి ప్రశ్న పత్రాలు డబ్బులకు అమ్మకోని పరీక్షలు రాయడం అన్న మాట. నిజానికి దేశంలోని ప్రతి రాష్ట్రం ఈ సమస్యను ఎదుర్కొంటుంది. సంవత్సరాల తరబడి.. నెల కొద్ది కుటుంబాలను వదిలి హైదరాబాద్ కు వచ్చి అమీర్ పేట్లో.. అశోక్ నగర్ (Ashok Nagar) లో.. చిక్కటి పల్లి లో కోచింగ్ సెంటర్ (Coaching Centre) లో హాస్టల్ ఉండి.. పోటీ పరీక్షల కోసం ప్రీపేర్ అవుతు ఉంటారు, తెలంగాణలో కూడా గత సంవత్సరం గ్రూప్ పేపర్ (Group Exams) లీక్ అయిన విషయం తెలిసిందే..

తాజా ఈ సమస్యలకు కేంద్ర చెక్ పెట్టబోతుంది. పోటీ పరీక్షలు జరిగినప్పుడు ప్రశ్నపత్రాలు లీక్‌ (Quotation Paper Leak) చేసి డబ్బులు దండుకునే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. క్వశ్చన్‌ పేపర్‌ లీకేజీ లాంటి వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన పబ్లిక్‌ ఎగ్జామినేషన్ ‌(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌-2024) (Prevention of Unfair Means-2024) బిల్లును కేంద్ర సర్కారు సోమవారం లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. కాగా ఈ పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ బిల్లును కేంద్రమంత్రి జితేందర్‌సింగ్‌ (Jitender Singh) లోక్‌సభలో (Lok Sabha) ప్రవేశపెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడే అధికారులు, ముఠాల ఆగడాలకు ఈ బిల్లుతో ఈలాంటి చర్యలకు పాల్పడే మూఠలకు గుండెట్లో రైలు పరిగెతుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ బిల్లు చట్టంగా మారితే.. ఈ చట్టం కింద నిందితులకు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్షతో పాటు నేర తీవ్రతను కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తారు.

ఇటీవలే ప్రధాని మోదీ సొంత రాష్ట్రాం అయిన గుజరాత్‌ తో సహా.. బీహార్‌, రాజస్థాన్‌, హర్యానా, రాష్ట్రాల్లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష ప్రశ్నపత్రాలు భారీగా లీకయ్యాయి. దీంతో ఎన్నో ఎళ్లుగా పరీక్షలకు ప్రీపరేషన్ అవుతున్న అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది.