New Criminal Laws: భారతీయ న్యాయశాస్త్రంలో కొత్త చట్టాలు.. అమలు ఎప్పటినుంచంటే
ఎప్పటినుంచో అమల్లో ఉన్న ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ చట్టాల స్థానంలో కొత్త చట్టాల్ని కేంద్రం తీసుకొచ్చింది. వీటి బదులు భారతీయ వ్యవస్థను ప్రతిబింబించేలా.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే మూడు చట్టాల్ని కేంద్రం రూపొందించింది.
New Criminal Laws: న్యాయశాస్త్రంలో అమలవుతున్న బ్రిటీష్ కాలంనాటి వలస చట్టాలను కేంద్రం మారుస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుంచో అమల్లో ఉన్న ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ చట్టాల స్థానంలో కొత్త చట్టాల్ని కేంద్రం తీసుకొచ్చింది. వీటి బదులు భారతీయ వ్యవస్థను ప్రతిబింబించేలా.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే మూడు చట్టాల్ని కేంద్రం రూపొందించింది.
TDP IN RAYALASEEMA: సీమ పాలిటిక్స్.. సీమలో టీడీపీ రెబల్స్ రచ్చ.. ఈ సారైనా సైకిల్ తిరుగుతుందా..?
వీటిని పార్లమెంటులో ఆమోదించారు కూడా. దీంతో ఇవి త్వరలోనే అమల్లోకి రానున్నాయి. ఈ చట్టాలు వచ్చే జూన్ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం హోం శాఖ వెల్లడించింది. ఈమేరకు నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. ఇదే సమయంలో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 106లోని సబ్ సెక్షన్ (2) అమలును వాయిదా వేసింది. ఈ చట్టంపై ఇటీవల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వల్ల ఒకరి మరణానికి కారణమైన వారికి కఠిన శిక్షలు విధిస్తూ ఈ చట్టాన్ని కేంద్రం రూపొందించింది. దీనిపై లారీ, ట్రక్కు డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతానికి ఈ చట్టాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. కొత్తగా వచ్చిన న్యాయ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది. గత డిసెంబర్‌లో దీనికి సంబంధించిన బిల్లుల్ని పార్లమెంట్ ఆమోదించింది. అదే నెలలో రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
ఇప్పటివరకు అమలవుతున్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లు బ్రిటీష్ పాలన కాలం నాటివి. అందుకే వీటని కేంద్రం రద్దు చేసింది. బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్బంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. భారతీయ భావనతో మన న్యాయ వ్యవస్థ ఉండేలా కొత్త బిల్లులను రూపొందించామని, బానిసత్వ భావనల నుంచి విముక్తి కల్పించామన్నారు. నేర న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులతో కొత్తగా నేర చట్టాలను తీసుకొచ్చామని తెలిపారు.