టెస్లా నుంచి ఫోన్ ? ఛార్జింగ్ అవసరం లేదు, ఇంటర్నెట్‌తో పని లేదు చంద్రుడి పైనుంచి కూడా కాల్స్
ఎలాన్ మస్క్ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. నిజానికి ఊహాతీతంగా ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పనేనా అని ప్రపంచం ఆలోచిస్తున్న సమయంలోనే దాన్ని నిరూపించి చూపేస్తాడు ఎలాన్ మస్క్.
ఎలాన్ మస్క్ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. నిజానికి ఊహాతీతంగా ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పనేనా అని ప్రపంచం ఆలోచిస్తున్న సమయంలోనే దాన్ని నిరూపించి చూపేస్తాడు ఎలాన్ మస్క్. అలాంటి పని రాక్షసుడు కాబట్టే ప్రపంచంలో అంత పేరు సంపాదించుకున్నాడు. సాఫ్ట్‌వేర్ నుంచి హార్డ్ వేర్ వరకూ.. ఆన్ లైన్ పేమెంట్ నుంచి స్టార్ లింక్ శాటిలైట్ వరకూ మస్క్ వేలు పెట్టని ఇండస్ట్రీ లేదు. అలాంటి మస్క్ నుంచి ఓ కొత్త ఫోన్ రాబోతోంది అనే వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌ను చుట్టేస్తోంది. టెస్లా నుంచి ఇప్పటికే కార్లు రిలీజ్ చేసిన మస్క్ ఇప్పుడు అదే బ్రాండ్ లోగోతో ఫోన్‌లు కూడా తయారు చేస్తున్నాడట.
టెస్లా మోడల్-2 పేరుతో ఈ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఫోన్ ఎంత క్రేజీగా ఉందో.. ఫోన్ ఫీచర్స్ కూడా అంతే క్రేజీగా ఉన్నాయి. అసలు ప్రపంచం మతి పోగొట్టె రెండు ఫీచర్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి సోలార్ ఛార్జింగ్. అంటే ఈ ఫోన్‌కు మనం చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. సూర్యుడి నుంచి వచ్చే సన్‌లైట్‌తో అదే ఛార్జ్ అవుతుంది. ఇంకో హైలెట్ ఏంటి అంటే ఈ ఫోన్‌కు ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్‌తో ఈ ఫోన్‌ను కనెక్ట్ చేస్తారట. ఈ డివైస్ మొత్తం స్టార్‌లింక్ బేస్‌గానే నడుస్తుందట. అంటే కేవలం భూమి మీదే కాదు.. చంద్రుడి మీదకు వెళ్లినా కూడా మనం ఈ టెస్లా ఫోన్‌తో కాల్స్ మాట్లాడుకోవచ్చన్నమాట. 2024 ముగిసేలోగానే ఈ ఫోన్‌ను ఎలాన్ మస్క్ లాంఛ్ చేయబోతున్నాడు అని ఇంటర్నెట్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజం ఎంత ఉంది అన్న విషయం పక్కన పెడితే.. ఈ రెండు ఫీచర్స్ మాత్రం నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది. చూడ్డానికి నమ్మేలా లేకపోయినా మస్క్ నుంచి ఇలాంటి ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పులేదు అంటున్నారు నెటిజన్లు.