T20 World Cup : వరల్డ్ కప్ లో కొత్త రూల్.. అలెర్ట్ గా లేకుంటే అంతే సంగతులు

టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని క్రికెట్ ఫాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీకి అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 30, 2024 | 05:45 PMLast Updated on: May 30, 2024 | 5:45 PM

New Rule In The World Cup

టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని క్రికెట్ ఫాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీకి అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే ఈ టీ20 వరల్డ్ కప్ నుంచి ఐసీసీ కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. అందులో ప్రధానమైంది 60 సెకన్ల స్టాప్ క్లాక్ రూల్.

సెకన్ల స్టాప్ క్లాక్ రూల్ ప్రకారం.. ఓవర్ వేయడం పూర్తి అయిన తర్వాత వెంటనే 60 సెకన్ల లోపు మరో బౌలర్ బౌలింగ్ ప్రారంభించాలి. లేదంటే బ్యాటింగ్ చేసే జట్టుకు పెనాల్టీ కింద 5 పరుగులను అదనంగా ఇస్తారు. దాంతో బ్యాటింగ్ చేసే జట్టుకు ఇది లాభమే. అయితే వికెట్ పడి మరో బ్యాటర్ క్రీజ్ లోకి వచ్చేటప్పుడు, అంపైర్ బ్రేక్ ఇచ్చినప్పుడు, గాయం కారణంగా ఫిజియో గ్రౌండ్ లోకి వచ్చినప్పుడు ఈ రూల్ వర్తించదు.

ఈ 60 సెకన్ల సమయాన్ని గ్రౌండ్ లో ఎలక్ట్రానికి గడియారంలో ప్రదర్శిస్తారు. కేవలం సమయాన్ని ఆదా చేయడానికే ఈ రూల్ ను ఐసీసీ తీసుకొచ్చింది. కెప్టెన్లు నిర్లక్ష్యం వహిస్తే.. భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. 5 పరుగుల పెనాల్టీ అంటే మ్యాచ్ ఫలితాన్నే మార్చే వీలుంటుంది. ఈ రూల్ ఇరు జట్లకు సమానంగా వర్తిస్తుంది.