IPL 2025, Kavya Maran : విదేశీ ప్లేయర్స్ కు ఇక చెక్.. కావ్యా పాప దెబ్బకు కొత్త రూల్స్

ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ కు ముందు జరగనున్న మెగా వేలం (Mega Auction) లో కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా విదేశీ ప్లేయర్స్ (Foreign players) కు ఈ రూల్స్ దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 2, 2024 | 07:05 PMLast Updated on: Aug 02, 2024 | 7:05 PM

New Rules Are Being Introduced In The Mega Auction To Be Held Before The Ipl 2025 Season

ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ కు ముందు జరగనున్న మెగా వేలం (Mega Auction) లో కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా విదేశీ ప్లేయర్స్ (Foreign players) కు ఈ రూల్స్ దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్నాయి. ఎందుకంటే కొందరు విదేశీ క్రికెటర్లు (Foreign cricketers) వేలంలో టీమ్ కొనుగోలు చేసిన తర్వాత గాయం పేరు చెప్పి సీజన్ నుంచి తప్పుకుంటున్నారు. వేలంలో తక్కువ ధర వచ్చిందనే కోపంతో కొందరు ఆటగాళ్లు గాయం కాకపోయినా అదే కారణాన్ని సాకుగా చూపి అందుబాటులో లేకుండా పోతున్నారు. ఇంకొందరు ఆడటం ఇష్టం లేక ఇంటర్నేషనల్ కమిట్​మెంట్స్ లేదా ఫ్యామిలీని సాకుగా చూపి జట్లను మధ్యలోనే వదిలేసి వెళ్తున్నారు. దీంతో ఇలాంటి ప్లేయర్స్ పై రెండేళ్ల పాటు ఐపీఎల్ ఆడకుండా బ్యాన్ చేయబోతున్నారు.

నిజానికి ఈ రూల్ తీసుకొస్తే ఆ క్రెడిట్ అంతా సన్ రైజర్స్ (Sunrisers) ఓనర్ కావ్యా మారన్ (Kavya Maran) కే దక్కుతుంది. ఎందుకంటే అలాంటి ప్లేయర్స్ ను నిషేధించాలని కావ్యానే బీసీసీఐని కోరింది. శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగ కారణంగానే కావ్య ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది. గతంలో 10 కోట్లు పలికిన హసరంగా 2021లో మాత్రం కోటిన్నరకే అమ్ముడయ్యాడు. దీంతో గాయం సాకుతో సన్ రైజర్స్ కు హ్యాండిచ్చాడు. తాజాగా దీనిని సీరియస్ గా తీసుకున్న కావ్యా మారన్ ఆక్షన్​లో అమ్ముడుబోయిన ఆటగాళ్లు ఇక మీదట తప్పనిసరిగా ఆయా టీమ్స్​లో ఆడేలా చూడాలని బీసీసీఐ (BCCI) ని కోరింది. గాయం అయితే తప్ప మిగిలిన కారణాలతో తప్పుకుంటే చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనికి బీసీసీఐ కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. కొత్త రూల్స్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.