గచ్చిబౌలి కేసులో కొత్త ట్విస్ట్‌.. కోల్‌కతాలాంటి దారుణమేనా..

హైదరాబాద్‌ గచ్చిబౌలి రెడ్‌స్టన్ హోటల్‌లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. జడ్చర్లకు చేందిన శృతి అనే యువతి.. రెండురోజుల కింద గణేశ్ వేడుకలను చూసేందుకు హైదరాబాద్ వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 16, 2024 | 07:12 PMLast Updated on: Sep 16, 2024 | 7:12 PM

New Twist In Gachibouli Case

హైదరాబాద్‌ గచ్చిబౌలి రెడ్‌స్టన్ హోటల్‌లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. జడ్చర్లకు చేందిన శృతి అనే యువతి.. రెండురోజుల కింద గణేశ్ వేడుకలను చూసేందుకు హైదరాబాద్ వచ్చింది. ఆదివారం రాత్రి స్నేహితురాలు, మరో ఇద్దరు అబ్బాయిలంతా కలిసి గచ్చిబౌలి రెడ్‌ స్టోన్‌ హోటల్‌కి వెళ్లి రెండు రూమ్‌లు రెంట్‌కు తీసుకున్నారు. అక్కడ స్నేహితులతో ఆ రాత్రి కలిసి పార్టీ చేసుకున్న శృతి.. సోమవారం తెల్లవారుజామున 3గంటలకు ఫ్యాన్ కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకునట్లు తెలుస్తోంది. ఇదీ పోలీసులు చెప్తున్న మాట.

ఐతే తల్లిదండ్రుల వాదన మాత్రం ఇంకోలా ఉంది. ఆదివారం కాల్‌ చేస్తే మంచిగానే మాట్లాడిందని.. రాత్రికి ఇలా ఉరేసుకుని చనిపోయిందని చెప్పడం షాక్‌కు గురి చేస్తుందని పేరెంట్స్ అంటున్నారు. యువతి ఒంటిపై గాయాలున్నాయని.. ఆమెను రేప్‌ చేసి.. ఆ తర్వాత ఉరేసి చంపేశారని ఆరోపణలు చేస్తున్నారు. యువతి చనిపోయిన గదిలో బీరుబాటిల్స్‌ ఉన్నాయి. గది నిండా రక్తం మరకలు కనిపిస్తున్నాయ్. తాము వచ్చే వరకు డెడ్‌బాడీని స్పాట్‌లోనే ఎందుకు ఉంచలేదని ప్రశ్నిస్తున్నారు. ఇక అటు ఆదివారం రాత్రి తర్వాత తామంతా హోటల్‌ నుంచి బయటకు వెళ్లామని… తనకు తలనొప్పిగా ఉందని తమతో రాలేదని యువతి ఫ్రెండ్స్ చెప్తున్నారు.

సోమవారం తెల్లవారుజామున 3గంటలకు తామంతా తిరిగి వచ్చామని.. రూమ్ లోపలి నుంచి గడియ వేసుకుని ఎంతకీ తీయలేదన్నారు. హోటల్‌ సిబ్బందికి చెప్పడంతో వారు మాస్టర్‌ కీతో తలుపు తీశారని.. అప్పుడు లోపల ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించిదని యువతి ఫ్రెండ్స్ చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కోల్‌కతా డాక్టర్ కేసు తర్వాత.. ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయినా.. అలాంటి భయాలే కనిపిస్తున్నాయ్. ఇక అటు తల్లిదండ్రులు కూడా రకరకాల ప్రశ్నలు సంధించడంతో.. అసలు యువతి మరణం వెనక ఏం జరిగిందని.. ఆరా తీసే పనిలో ఉన్నారు పోలీసులు.