New website : ఐబొమ్మకు బదులుగా కొత్త వెబ్‌సైట్.. ఇక సినిమాలన్నీ ఫ్రీ
తెలుగు మూవీ (Telugu Movies) లవర్స్‌కు (Movie Lovers) ఐబొమ్మ (iBomma) వెబ్‌సైట్‌ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

New website instead of Eyebomma.. Now all movies are free
తెలుగు మూవీ (Telugu Movies) లవర్స్‌కు (Movie Lovers) ఐబొమ్మ (iBomma) వెబ్‌సైట్‌ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓటీటీ (OTT) లో వచ్చే ప్రతీ సినిమాను అదే క్లారిటీతో ఐబొమ్మలో చూసేయొచ్చు. ఈ ఐబొమ్మ సైట్ వల్ల చాలా మంది యూజర్స్ ఓటీటీ మెంబర్‌షిప్ తీసుకోవడమే మానేశారు. థియేటర్స్ ప్రింట్స్‌కు పైరసీ ఎలా దెబ్బేసేదో.. ఓటీటీ రిలీజ్‌లకు ఐబొమ్మ కూడా అదే రేంజ్‌తో దెబ్బేసేది. రీసెంట్‌గా చాలా మంది సెలబ్రిటీలు, ఫిల్మ్ మేకర్స్ ఈ వెబ్‌సైట్ గురించి మాట్లాడారు. దీనివల్ల చాలా నష్టపోతున్నామంటూ కూడా చెప్పారు. ఐతే కొన్ని రోజులుగా ఈ సైట్‌లో చాలా మార్పులు వచ్చాయి. రీసెంట్‌గా ఐబొమ్మలో ఏ సినిమాను క్లిక్ చేసినా అది ఓటీటీకి రీడైరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అంటే ఐబొమ్మలో కూడా డబ్బులు కట్టే సినిమా చూడాలి అన్నమాట. దీంతో ఐబొమ్మ ఫ్యాన్స్ అంతా తెగ హర్ట్ ఐపోయారు.
ఆ సైట్‌లో సనిమాలు చూడటం మానేశారు. ఐతే ఇప్పుడు అదే ఐబొమ్మ మళ్లీ తిరిగి వచ్చింది. కానీ కొత్త పేరుతో వచ్చింది. అదే బప్పం టీవీ. వినేందుకు ఫన్నీగా ఉంది కదా. పిచ్చర్ అంతా సేమ్.. కానీ నేమ్ మాత్రం ఛేంజ్. అవే సెట్టింగ్స్‌తో.. అదే కలర్స్‌తో.. పేరు మార్చుకుని మళ్లీ ఫ్యాన్స్ మధ్యలోకి వచ్చింది ఐబొమ్మ. ఒకప్పుడు ఐబొమ్మలో ఎలా ఐతే సినిమాలు చూశారో ఇప్పుడు బప్పం టీవీలో కూడా అలాగే ఫ్రీగా సినిమాలు చూడొచ్చు. ఈ కంబ్యాక్‌తో మేకర్స్‌లో మళ్లీ కొత్త టెన్షన్ మొదలయ్యింది. పోయింది అనుకుంటే పేరు మార్చుకుని మళ్లీ వచ్చింది అని తలలు పట్టుకుంటున్నారు. మొన్నటి వరకూ ఐబొమ్మ సైట్ రియాక్ట్ అవ్వకపోవడంతో ఇక ఓటీటీ సినిమాలకు ఎలాంటి ప్రాబ్లం లేదని మేకర్స్ హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఇప్పుడు బప్పం పేరుతో మరోసారి ఈ సైట్ ముందుకు రావడంతో వాళ్లకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.