NEW YEAR RULES : న్యూఇయర్ రోజు ఇలా చేశారో.. అంతే !

కొత్త ఏడాది 2024కు స్వాగతం పలకడానికి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది.  డిసెంబర్ 31 నుంచి జనవరి ఫస్ట్ దాకా ధూమ్ ధామ్ గా పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేసేందుకు యూత్ రెడీ అవుతున్నారు. కానీ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ యువత ఈ సందర్భంగా కొన్ని అలెర్ట్స్ గుర్తుపెట్టుకోవాలి... వాటిని అతిక్రమించితే చాలా ఇబ్బందుల్లో పడిపోతారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2023 | 07:31 PMLast Updated on: Dec 27, 2023 | 7:31 PM

New Year Rules

New year Celebrations – New Rules: కొత్త ఏడాది సెలబ్రేషన్స్ కు మస్తుగా ప్రిపేర్ అయినట్టున్నారు.  కానీ కొన్ని విషయాలు తెలుసుకోకపోతే… హ్యాపీ న్యూ యర్ (Happy New year) … మొదట్లోనే సాడ్ ఇయర్ అవ్వొచ్చు.  దేశమంతటా JN1 కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తోంది.  సో… మీరు పార్టీల కోసమంటూ భారీగా జనం గుమికూడే ఈవెంట్స్ కు వెళ్తుంటే… తగిన ప్రికాషన్స్ తీసుకోవాలి. గతంలో కరోనా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో… అవన్నీ ఇప్పుడు పాటించాలి. మాస్క్ పెట్టుకోవడం…. శానిటైజర్ యూజ్ చేయడం.. లేదంటే… చేతులు శుభ్రంగా కడుక్కోవడం చేయాలి.  ఈ న్యూ ఇయర్ కి కరోనా కేసులు భారీగా పెరగవచ్చని రెండు తెలుగు రాష్ట్రాల వైద్యశాఖలు వార్నింగ్ ఇస్తున్నాయి. వీలున్నంత వరకూ ఇంట్లోనే కుటుంబ సభ్యులతోనే హ్యాపీగా న్యూఇయర్ ని ఎంజాయ్ చేయడం బెటర్.

డిసెంబర్ 31 అర్థరాత్రి (December 31st mid night ) నాడు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే పోలీసులు కేసులు బుక్ చేస్తారు. ఫైన్లు విధించడంతో పాటు  జైలుకు కూడా పంపుతారు.  హైదరాబాద్ లో అయితే 31st మిడ్ నైట్ నుంచి దాదాపు అన్ని ఫ్లైఓవర్లు మూసేస్తున్నారు.   సో… మీరు ఆల్టర్నేట్ రూట్స్ లో ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ముందే ప్లాన్ చేసుకోండి.  ఇక ఆ రోజు మద్యం తాగి వాహనాలు నడిపితే పోలీసులు కేసులు బుక్ చేస్తారు.  ఆల్టర్నేట్ గా క్యాబ్ లో ఇంటికి వెళ్ళడం బెటర్. అందుకే క్యాబ్, టాక్సీ, ఆటోలు నడిపేవారికి కొన్ని సూచనలు చేశారు తెలంగాణ పోలీసులు. డ్రైవర్లు ఆ రోజు ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకోవాలి… లైసెన్స్ ఇతర డాక్యుమెంట్స్ దగ్గర ఉంచుకోవాలి.  ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ డబ్బులు వసూలు చేయడం లేదంటే రైడ్ ని నిరాకరించడం లాంటివి చేయకూడదు.  అలా చేస్తే పోలీసులు కేసులు పెట్టడంతో పాటు జరిమానాలు వేస్తారు.

డిసెంబర్ 31 నుంచి జనవరి 1 నాడు ఒంటి గంట వరకు మాత్రమే పబ్స్, బార్స్ కి (Pubs, Bars) అనుమతి ఉంటుంది.  రాత్రి ఒంటి గంట దాటి నడిపితే పోలీసులు కేసులు పెడతారు.  అలాగే మద్యం సేవించిన వారు… వాహనాలను నడపడానికి అనుమతిస్తే ఆయా పబ్స్, బార్స్ నిర్వాహకుల మీద కూడా కేసులు బుక్ అవుతాయి.  మద్యం సేవించిన వారిని క్షేమంగా ఇంటికి పంపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఆయా ఈవెంట్స్, పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్స్ (Restaurants) నిర్వాహకులే చేయాలి.

వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో మద్యం తాగి బండ్లు నడపకూడదు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణాలు చేస్తే పోలీసులు కేసులు పెడతారు.  సైబరాబాద్ పరిధిలో డిసెంబర్ 31 రాత్రి ఎనిమిదింటి నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి తనిఖీలు చేస్తారు.  తాగి వాహనం నడిపినా… సరైన డాక్యుమెంట్స్ లేకున్నా ఆ వెహికిల్స్ సీజ్ చేస్తామనీ, కేసు బుక్ చేసి కోర్టుకు పంపుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  అలాగే అధిక శబ్దం చేస్తూ వెహికిల్స్ నడిపడం… మ్యూజిక్ సిస్టమ్స్ ఉపయోగించడాన్ని నిషేధించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తారు.  తాగి నడిపిన వారు మొదటిసారి పట్టుబడితే 10 వేల జరిమానా, 6 నెలల దాకా జైలు శిక్ష పడే ఛాన్సుంది. రెండు అంత కంటే ఎక్కువసార్లు నేరం చేస్తే… 15 వేల రూపాయల జరిమానా, 2 యేళ్ళ దాకా జైలు శిక్ష పడుతుంది.  డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) కూడా సస్పెండ్ చేసే అవకాశముంది.  న్యూఇయర్ జరుపుకునే వాళ్ళంతా… కోవిడ్ రూల్స్, (Covid Rules) పోలీసుల సూచనలు  తప్పకుండా పాటించాలి. లేకపోతే మాత్రం కొత్త ఏడాదిలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.