Zoonotic diseases: కోవిడ్ తరహా ముప్పు మరోసారి తప్పదా..! ఈ సారి ఏ దేశం నుంచో తెలుసా..?
గతంలో కోవిడ్ అనే మహమ్మారి చైనా నుంచి వ్యాప్తి చెందినట్లు కొన్ని సంస్థలు ధృవీకరించాయి. తాజాగా ఇలాంటి సంక్షోభమే మరో సారి తలెత్తే అవకాశం ఉందని డబ్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది. అయితే ఈసారి అమెరికా ఈ వ్యాధి ప్రభలించేందుకు వేదిక కానున్నట్లు తాజాగా ఒక సంస్థ చేసిన అధ్యయనంలో వెలువడింది. అసలు ఎందుకు ఇలాంటి వ్యాధులు సంక్రమిస్తాయి. వీటి ప్రభావం ఎంతగా ఉంటుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
మాంసం సరఫరా కేంద్రాలే వ్యాధులకు ఆవాసాలు..
న్యూయార్క్ యూనివర్సిటీతో పాటూ హార్వర్డ్ లా స్కూల్ పొందుపరిచిన నివేదికలో చాలా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో మాంసం సరఫరా చేసే మార్కెట్లు, అందులో పనిచేసేవారి అలవాట్లు, అక్కడి జంతువులకు సోకిన రకరకాలా వైరస్ల కారణంగా ఇవి ఇతరులకు ప్రబలే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇలా జంతువుల నుంచి మానవులకు సోకే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారని తెలిపారు. ఇలా కేవలం జంతువుల నుంచి మాత్రమే అంటుకునే వ్యాధులు ప్రాణాంతకంగా మారుతాయని వివరించారు. గాలి, నీరు, ఆహారం, వస్తువలు, అక్కడి వాతావరణ పరిస్థితులు ద్వారా కూడా సంక్రమిస్తాయని నివేదికలో పొందుపరిచారు.
ప్రాణాంతకమైనవి ఇవే..
వీటిలో చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా ఎబోలా, జికాతో అనేవి ప్రాణాంతక వ్యాధులుగా చెబుతున్నారు. ఇవి అతి త్వరగా ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే కోవిడ్ మహమ్మారి తరహాలోనే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. ఇవి ముఖ్యంగా ఫార్మ్ లలో జంతువులతో ఎక్కువగా గడిపే వారికి, పక్షులు, జంతువుల చర్మాన్ని తమ శరీరానికి తాకిస్తూ పనిచేసే వారికి ఎక్కువగా సోకే అవకాశం ఉంది. అలాగే కోళ్లు, పందుల నుంచి వచ్చే వ్యర్థాలను నియంత్రణ సక్రమంగా చేపట్టక పోయనా వీటి ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి లభించే పాలూ, గుడ్లు, మాంసం వంటి పదార్థాలను స్వీకరిస్తే మిగిలిన వారికి కూడా ప్రబలే ఆస్కారం ఉందని జంతు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీటిపై తాజాగా యాన్ లిండర్ అనే పరిశోధకురాలు ఫార్మ్ లను ప్రత్యేక్షంగా చూసి ఈవివరాలను వెల్లడించారు.
పందుల పెంపకం, పౌల్ట్రీ ఫారాలే కీలకం..
వివిధ రకాల అవసరాల కోసం సంవత్సరానికి కేవలం అమెరికా నుంచే దాదాపు 22 కోట్ల జంతువులు అగ్రరాజ్యం అమెరికాలోకి దిగుమతి అవుతున్నట్లు వివరించారు. సీడీసీ ఇచ్చిన వివరాల ప్రకారం అమెరికాలో బర్డ్ ఫ్లూ మానవులకు అంత సులువుగా సంక్రమించదని తెలిపారు. పందుల పెంపకం, పౌల్ట్రీ ఫారాల్లో పనిచేసే వారి నుంచి అధిక సంఖ్యలో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని డెల్సియన్నా విండెర్స్ అనే నిపుణులు వివరణ ఇచ్చారు.
T.V.SRIKAR