కేన్ మామ దూకుడు, టెస్టుల్లో అరుదైన రికార్డ్
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ రీఎంట్రీ దుమ్మురేపుతున్నాడు. గాయం నుంచి కోలుకుని మళ్ళీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన కేన్ మామ ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో చరిత్ర సృష్టించాడు.
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ రీఎంట్రీ దుమ్మురేపుతున్నాడు. గాయం నుంచి కోలుకుని మళ్ళీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన కేన్ మామ ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 9వేల పరుగులు సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. పది ఫోర్లతో 93 పరుగులు చేసిన కేన్ మామ.. రెండో ఇన్నింగ్స్‌లో 86 బంతుల్లో 61 పరుగులు చేశాడు. టెస్టుల పరంగా వేగంగా 9వేల పరుగుల మార్క్‌ను అందుకున్న మూడో బ్యాటర్‌గా కుమార్ సంగక్కర్ , యునిస్ ఖాన్ సరసన విలియమ్సన్ నిలిచాడు. ఈ కివీస్ మాజీ కెప్టెన్ తన కెరీర్ 103వ టెస్టులో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో విలియమ్సన్ కంటే ముందు స్టీవ్ స్మిత్ , బ్రియాన్ లారా ఉన్నారు.