News Click: పాత్రికేయుల స్వేచ్ఛ కోరుతూ సీజేఐకి లేఖ రాసిన 15 మీడియా సంస్థలు
పాత్రికేయులపై చేసే దాడులను ఖండిస్తూ తగు చర్యలు తీసుకోవాలని సీజేఐకి పలు మీడియా సంస్థలు లేఖ రాశాయి. ఇందులో ఏఏ అంశాలను ప్రస్తావించాయో ఇప్పుడు చూద్దాం.

News Click And 15 different media houses have written to the CJI condemning the attacks on them
ప్రజల సమస్యలు, పాలకులు పరిపాలనా లోపాలు ఎత్తి చూపేందుకే పాత్రికేయులు ఉన్నారు. వీరు తమ కుటుంబాలను పక్కన పెట్టి ప్రజాహితం కోసం నిత్యం పరితపిస్తూ ఉంటారు. ఇలాంటి వారిపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతున్నారు. ఐటీ సోదాల పేరిట జర్నలిస్టుల ఇండ్లలో సోదాలు నిర్వహించేలా హేయమైన చర్యలకు పూనుకుంటున్నారు. ఇలాంటి చర్యలను ఖండిస్తూ 15 మీడియా సంస్థలకు చెందిన కొందరు జర్నలిస్ట్ లు కోర్టు మెట్లెక్కారు. వాస్తవాలను చూపించినందుకు తమపై ప్రతీకార దాడులులకు పాల్పడుతున్నట్లు భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ అంశంపై జస్టిస్ చంద్రచూడ్ కు లేఖ రాశారు.
46 మంది ఇళ్ల పై సోదాలు..
జర్నలిస్టులపై ఇలాంటి దాడులు చేయడం చాల పిరికి చర్య అన్నారు. పాత్రికేయులు నిజాలు మాట్లాడినంత కాలం సమాజంలో స్వేచ్ఛ సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు. గడిచిన కొన్ని రోజులుగా న్యూస్ క్లిక్ అనే ఆన్ లైన్ పోర్టల్ లో పనిచేసే 46 మంది ఉద్యోగుల ఇళ్లలో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రశ్నించినందుకు ఆ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థను అరెస్ట్ చేసినట్లు లోఖలో పొందుపరిచారు. తమకు కేటాయించిన అధికారాన్ని కేవలం ఇలాంటి అమాయకులపై ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ప్రస్తావించారు. ఇంతటితో ఆగకుండా తమపై ఆయుధాలను ప్రయోగిస్తున్నాయని కొన్ని మీడియా సంస్థలు ఈ సందర్భంగా ఆరోపించాయి.
పలు అంశాలపై స్పందిస్తే సహంచక పోవడం
దేశంలో చాలా మంది మీడియా ప్రతినిధులు, పాత్రికేయులు తమపై ఎక్కడ దాడులు జరుగుతాయో అన్న భయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయంగా జరుగుతున్న విషయాలపై స్పందిస్తూ కొందరు జర్నలిస్టులు తమ కలానికి పనిచెబుతుంటే సహించలేక పోతున్నారు. కొన్ని ప్రభుత్వాలు వీటిని అంగీకరించడం లేదని పేర్కొన్నారు. దీనికి ప్రత్యమ్నాయంగా బెదిరింపులు, సోదాలు చేస్తూ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు సీజేఐ కి వివరించారు. ఈ లేఖలో చివరిగా ప్రస్తావిస్తూ పాత్రికేయులు చట్టానికి అతీతులు కాదు, అలా ఉండాలని మేము కోరుకోవడం లేదన్నారు. అయితే పత్రికే స్వేచ్ఛను హరిస్తే మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థలో పునాదులు కదిలే అవకాశం ఉంటుందన్నారు.
సరికొత్త విధివిధానాలకై విజ్ఞప్తి
పత్రికా రచయితలుగా ఎప్పుడూ ప్రభుత్వాలతో స్నేహభావంతో ఉంటూ వారికి సహకరించేందుకు సిద్దంగా ఉన్నట్లు వివరించారు. అయితే అన్యాయం జరిగితే మాత్రం వాటిని చూపించేందుకు వెనుకాడమని సీజేఐకి రాసిన లేకలో ప్రస్తావించారు. దీనికోసం సరికొత్త విధివిధానాలను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇలా నేరుగా ఎవరి ఇంట్లో పడితే వాళ్ల ఇంట్లో చొరబడి దాడులు చేయడం, వారి నుంచి సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, హార్డ్ డిస్క్ లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకునే విషయంలో కొంత చొరవ చూపాలని కోరారు.
T.V.SRIKAR