పూరన్ జోరుకు అడ్డేది విండీస్ హిట్టర్ మరో రికార్డ్
టీ ట్వంటీ క్రికెట్ లో వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ జోరుకు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. గత కొంతకాలంగా పరుగుల వరద పారిస్తున్న పూరన్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ లోనూ దుమ్మురేపుతున్నాడు.
టీ ట్వంటీ క్రికెట్ లో వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ జోరుకు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. గత కొంతకాలంగా పరుగుల వరద పారిస్తున్న పూరన్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ లోనూ దుమ్మురేపుతున్నాడు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న పూరన్.. టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్ 15 బంతుల్లో 27 పరుగులు చేశాడు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు 65 ఇన్నింగ్స్‌ల్లో 2,059 పరుగులు చేశాడు. అతడు ఈ ఏడాది అంతర్జాతీయ టీ ట్వంటీలతో పాటు పలు ఫ్రాంచైజీ లీగ్స్ లో ఇప్పటి వరకూ 14 హాఫ్ సెంచరీలు, రెండుసార్లు 90కి పైగా రన్స్ చేశాడు.