Nirmala Sitharaman Saree: చీర స్పెషాలిటీ.. బడ్జెట్ వేళ మంత్రి నిర్మలా ధరించిన చీర ప్రత్యేకత తెలుసా..
బడ్జెట్ సమయంలో ఆమె ప్రసంగాలు మాత్రమే కాదు.. ఆమె ధరించే చీరలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. చేనేత చీరలను ఎక్కువగా ఇష్టపడే ఆమె.. ఈసారి కూడా ఒడిశా చేనేత చీరను ధరించి బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు.

Nirmala Sitharaman Saree: కేంద్ర ఆర్ధిక శాఖమంత్రిగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ప్రతి బడ్జెట్ సమావేశాలకు నిరాడంబరంగా హాజరయ్యే ఆమె.. ఈ సారి కూడా అదే తీరును అవలంభించారు. బడ్జెట్ సమయంలో ఆమె ప్రసంగాలు మాత్రమే కాదు.. ఆమె ధరించే చీరలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. చేనేత చీరలను ఎక్కువగా ఇష్టపడే ఆమె.. ఈసారి కూడా ఒడిశా చేనేత చీరను ధరించి బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు.
New Delhi: అనుభవించు రాణి ! అకౌంట్లో రూ.41.. బిల్లేమో 6 లక్షలు.. ఢిల్లీ హోటల్లో ఏపీ మహిళ బిల్డప్
ప్రతిసారి ఆర్థిక మంత్రి డ్రెస్సింగ్ నుంచి చేతిలో ఉండే బడ్జెట్ బ్యాగ్ వరకు ప్రతి ఒక్కటీ స్పెషల్‌గా నిలవగా.. ఈసారి కూడా అంతకు మించి హైలైట్‌గా నిలిచారు. టస్సర్ పట్టు చేనేత చీర కట్టుకొని పార్లమెంటులోకి అడుగుపెట్టారు మంత్రి నిర్మలా సీతారామన్. ప్రతి ఏడాది బడ్జెట్ ప్రసంగం నాడు ప్రత్యేకమైన చీర కట్టుకొని రావడం నిర్మలమ్మకు అలవాటు. ఈసారి కూడా నీలం, క్రీమ్ కలర్ టస్సర్ చీరలో కనిపించారు తెలుగింటి కోడలు. చేతిలో బడ్జెట్ ట్యాబ్ పట్టుకొని, గోధుమ రంగులో బెంగాల్ కల్చర్‌ను ప్రతిబింబించే ఎంబ్రాయిడరీతో ఉన్న శారీలో మెరిసిపోయారు. ఆమె ధరించిన చీరకు ఉన్న నీలి రంగును తమిళనాడులో రామా బ్లూ అని పిలుస్తారు. వందశాతం పట్టుతో ఈ చీరలను కళాకారులు తయారు చేస్తారు. ఒక్క చీర నేసేందుకు సుమారు 15 రోజులు సమయం పడుతుంది. ఇవాళ నిర్మలమ్మ కట్టుకు వచ్చిన చీరపై ఆకులు, తీగలతో కూడిన డిజైన్ కనిపిస్తుంది. ఇటీవల అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు సంకేతంగా ఆమె ఈ రంగు చీరలో కనిపించారు.
అటు బెంగాల్‌తో పాటు ఇటు తమిళనాడు సంప్రదాయాన్ని కలగలిపిన చీరను ధరించిన నిర్మలమ్మ.. అయోధ్య మందిర ప్రాణప్రతిష్టను కూడా గుర్తుచేయడంతో రామ భక్తుల మనసులు కూడా దోచుకున్నారు. ఈ చీర విలువ దాదాపు రూ.25 వేల నుంచి రూ.60 వేలు ఉంటుందని అంచనా. గతంలో బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు నిర్మలా కట్టుకున్న చీరలను చూస్తే.. 2019లో తొలిసారిగా బడ్జెడ్ ప్రవేశ పెట్టారు. అప్పుడు గులాబీ రంగులో బంగారు అంచు ఉన్న మంగళగిరి చీరను ధరించారు. 2020లో రెండోసారి బడ్జెట్ ప్రవేశపెడుతూ.. పసుపు రంగు సిల్క్ చీరను ధరించారు. మూడోసారి 2021లో తెలంగాణకే తలమానికంగా నిలిచిన పోచంపల్లి ఇక్కత్ చీరను కట్టుకున్నారు. 2022లో బడ్జెట్ సమర్పణకు బ్రౌన్ కలర్ చీరను కట్టుకున్నారు. 2023లో ఎరుపు రంగు బార్డర్ చీరను ధరించారు. దానిపై ఎరుపు, నలుపు కలర్ జరీ బార్డర్, టెంపుల్ డిజైన్ ఉంది. ఇప్పుడు ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా.. ఈ సారి కూడా ప్రత్యేకమైన చీరలను ధరించి వార్తల్లో నిలిచారు.