Nitish Kumar Reddy : జాక్ పాట్ కొట్టిన నితీశ్ కుమార్ రెడ్డి.. యువక్రికెటర్ తో పూమా డీల్
యువక్రికెటర్, తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి జాక్ పాట్ కొట్టాడు. గాయంతో జింబాబ్వే పర్యటనకు దూరమవడం నిరాశ కలిగించిన ఈ యంగ్ ప్లేయర్ కు గొప్ప ఆఫర్ దక్కింది.

Nitish Kumar Reddy who hit the jackpot.. Puma deal with the young cricketer
యువక్రికెటర్, తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి జాక్ పాట్ కొట్టాడు. గాయంతో జింబాబ్వే పర్యటనకు దూరమవడం నిరాశ కలిగించిన ఈ యంగ్ ప్లేయర్ కు గొప్ప ఆఫర్ దక్కింది. ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ కంపెనీ ‘పుమా’ నితీష్ కుమార్ రెడ్డిని తమ ప్రచారాకర్తగా నియమించుకుంది. ఐపీఎల్ 2024లో సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డితో పాటు రియాన్ పరాగ్‌లను బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. ఐపీఎల్ 17వ సీజన్ లో నితీశ్ కుమార్ అదరగొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఈ ఆల్ రౌండర్ ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనతోనే జాతీయ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. అయితే బెంగళూరు ఎన్ సిఎలో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడడంతో జింబాబ్వే టూర్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
తాజాగా పూమా బ్రాండ్ నితీశ్ తో డీల్ కుదుర్చుకుంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ పుమా బ్రాండ్ కు ప్రచారం చేస్తుండగా.. రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డిలు వారి సరసన చేరారు. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్‌లకు పుమా కంపెనీ వీరికి భారీ మొత్తంలో చెల్లించనుంది. ఇటీవల ఆంధ్రా ప్రీమియర్ లీగ్ వేలంలోనూ నితీశ్ కు భారీ దర దక్కింది.