Nitish Kumar: తొమ్మిదోసారి బిహార్ సీఎంగా నితీష్.. మండిపడుతున్న విపక్షాలు
గవర్నర్‌కు సీఎంగా రాజీనామా సమర్పించిన నితీష్.. తర్వాత బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రమాణం చేయడం విశేషం. ఈ మేరకు నితీష్‌కు మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ లేఖ సమర్పించింది. దీంతో నితీష్‌తో సీఎంగా గవర్నర్ ప్రమాణం చేయించారు.
Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు జేడీయూ అధినేత నితీష్ కుమార్. కాంగ్రెస్, ఆర్జేడీ, ఇతర పక్షాలతో కలిసి ఇంతకాల కొనసాగిన మహాఘట్‌బంధన్ నుంచి నితీష్ బయటకొచ్చిన సంగతి తెలిసిందే. గవర్నర్‌కు సీఎంగా రాజీనామా సమర్పించిన నితీష్.. తర్వాత బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రమాణం చేయడం విశేషం. ఈ మేరకు నితీష్‌కు మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ లేఖ సమర్పించింది. దీంతో నితీష్‌తో సీఎంగా గవర్నర్ ప్రమాణం చేయించారు.
CHANDRABABU NAIDU: జగన్ అర్జునుడు కాదు.. భస్మాసురుడు.. ఏపీని నెంబర్ వన్ చేస్తా: చంద్రబాబు
నితీశ్ కుమార్‌తో పాటు సామ్రాట్ చౌదరి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో బీజేపీ నేత విజయ్ సిన్హా కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మహాఘట్‌బంధన్‌లో సమస్యలుండటం వల్లే బయటకు రావాల్సి వచ్చిందన్నారు. నితీష్ నిర్ణయంపై కాంగ్రెస్, ఆర్జేడీ, ఏఐఎంఐఎం వంటి పార్టీలు మండిపడుతున్నాయి. నితీశ్ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. నితీష్‌లాగా దేశంలో చాలా మంది ‘ఆయారాం-గయారాం’లు తయారయ్యారని ఖర్గే అన్నారు. ఇలా జరుగుతుందని తనకు ముందే తెలుసన్నారు. ఇండియా కూటమి నుంచి నితీష్ బయటకు వెళ్లినప్పటికీ.. కూటమిని కాపాడుకుంటామన్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. నితీష్‌పై విమర్శలు గుప్పించారు. నితీష్‌తో పొత్తు పెట్టుకున్నందుకు బీజేపీకి థాంక్స్ చెప్పారు. నితీశ్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తనకు ఇష్టం లేదని, ఆయన అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
కానీ తన మాటలు మాత్రం గుర్తుపెట్టుకోవాలని, 2024లో జేడీయూ కథ ముగిసిపోతుందన్నారు. నితీష్‌కు అసలు ఆట ముందుందన్నారు. నితీశ్ కుమార్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని మళ్లీ బీజేపీతో చేతులు కలపడాన్ని తప్పుబట్టారు. తమ పార్టీని బీజేపీ బీ టీమ్ అని నిన్నటి వరకు నితీశ్ విమర్శించాడాని, ఇప్పుడు ఆయనే వెళ్లి బీజేపీతో జతకట్టారని గుర్తు చేశారు. ఇలా చేసినందుకు నితీశ్‌కు సిగ్గు లేదా అని ఘాటుగా విమర్శించారు. ఇలా కూటములు మారుస్తూ నితీశ్.. బీహార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, తక్షణమే బీహారీలకు ఆయన క్షమాపణ చెప్పాలని ఓవైసీ డిమాండ్ చేశారు.