Nitish Kumar: మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన సీఎం నితీష్ కుమార్..
బిహార్ అసెంబ్లీలో రాష్ట్రంలో జనాభా నియంత్రణ, సంతానోత్పత్తి గురించి సీఎం నితీష్ కుమార్ మాట్లాడారు. ఈ విషయంలో మహిళల పాత్ర గురించి చెప్పాలనుకున్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ఎందుకు పడిపోయిందో సీఎం వివరిస్తూ మహిళలను కించపరిచేలా మాట్లాడారు.

Nitish Kumar: జనాభా నియంత్రణ విషయంలో మహిళలను ఉద్దేశిస్తూ బిహార్ (BIHAR) సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar bihar) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నితీష్ తాజాగా క్షమాపణలు చెప్పారు. బిహార్ అసెంబ్లీలో రాష్ట్రంలో జనాభా నియంత్రణ, సంతానోత్పత్తి గురించి సీఎం నితీష్ కుమార్ మాట్లాడారు. ఈ విషయంలో మహిళల పాత్ర గురించి చెప్పాలనుకున్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ఎందుకు పడిపోయిందో సీఎం వివరిస్తూ మహిళలను కించపరిచేలా మాట్లాడారు.
Teenmar Mallanna: అంతన్నావ్.. ఇంతన్నావ్.. కాంగ్రెస్‌లో చేరావ్.. వాటీజ్ దిస్ మల్లన్న..
“మహిళలు చదువుకోవడంతో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెరిగింది. ఏ సమయంలో ఏం చేయాలో వాళ్లకు తెలుసు. భర్తల చేష్టల వల్లే మరిన్ని జననాలు జరుగుతున్నాయి. అయితే, చదువుకున్న స్త్రీలు వాటిని కట్టడి చేస్తున్నారు. దీంతో జననాలు తగ్గుతున్నాయి” అని నితీష్ వ్యాఖ్యానించారు. చదువుకున్న మహిళలు…. పురుషుల్ని నియంత్రించగలరని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం నితీష్ రాష్ట్రంలోని మహిళలను అవమానించారని బీజేపీ అభిప్రాయపడింది. నితీష్ వ్యాఖ్యలు తమను బాధించాయని బీజేపీ మహిళా ఎమ్మెల్యేలు చెప్పారు. అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా దీనిపై స్పందించింది. నితీష్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని మహిళా కమిషన్ డిమాండ్ చేసింది.
PAWAN KALYAN: పంచుల్లేని పవన్ ప్రసంగం.. బీజేపీ సభలో అంటీ ముట్టనట్టు..!
ఇతర వర్గాలు, మహిళా సంఘాల నుంచి కూడా నితీష్‌పై ఈ విషయంలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పొరపాటు గుర్తించిన నితీష్.. మహిళలకు క్షమాపణలు చెప్పారు. తన మాటలు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని, తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుంటున్నానని నితీష్ అన్నారు. అయతే, నితీష్ వ్యాఖ్యల్ని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాత్రం సమర్ధించడం విశేషం.