చరిత్రలో నిలిచిపోయే సెంచరీ…!
మెల్‌బోర్న్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. మూడో రోజు పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్ ను అద్భుతమైన సెంచరీతో ఆదుకుని తెలుగోడి సత్తా ఆస్ట్రేలియా గడ్డపై చూపించాడు.
మెల్‌బోర్న్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. మూడో రోజు పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్ ను అద్భుతమైన సెంచరీతో ఆదుకుని తెలుగోడి సత్తా ఆస్ట్రేలియా గడ్డపై చూపించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన నితీష్… భారత్ ఇన్నింగ్స్ ను చాలా జాగ్రత్తగా కాపాడాడు.
ఆ తర్వాత నితీష్‌రెడ్డి 171 బంతుల్లోనే తొలి శతకం పూర్తి చేశాడు. 21 ఏళ్ల 216 రోజుల వయసులో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన మూడో పిన్న వయస్కుడిగా నిలిచాడు. 244/7తో రెండో సెషన్‌ను ప్రారంభించిన భారత్… ఎక్కడా వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసింది. సుందర్ తో కలిసి నితీష్… చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం 105 పరుగులతో నితీష్ క్రీజ్ లో ఉన్నాడు. బ్యాడ్ లైట్ కారణంగా మూడో రోజు ఆట అరగంట ముందే ముగించారు అంపైర్లు.