పుష్ప,బాహుబలి,సలార్… సెలబ్రేషన్స్ లో నితీశ్ ట్రెండ్

క్రికెట్,సినిమా రెండింటికీ మన దేశంలో మోస్ ఫాలోయింగ్ ఉంది... అందుకే ఆ సెలబ్రిటీల స్టైల్స్ వీళ్ళు... వీరి స్టైల్స్ వాళ్ళు ఫాలో అవుతూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 28, 2024 | 06:37 PMLast Updated on: Dec 28, 2024 | 6:37 PM

Nitishs Batting Prowess Record Breaking In Aussies

క్రికెట్,సినిమా రెండింటికీ మన దేశంలో మోస్ ఫాలోయింగ్ ఉంది… అందుకే ఆ సెలబ్రిటీల స్టైల్స్ వీళ్ళు… వీరి స్టైల్స్ వాళ్ళు ఫాలో అవుతూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూంటారు. ఇక ఇండియన్ సినిమాలో ప్రభాస్ బాహుబలి, సలార్ తో పాటు అల్లు అర్జున్ పుష్ప మూవీస్ క్రియేట్ చేసిన సెన్షేషన్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పుష్ప తగ్గేదే లే ఐకానిక్ సెలబ్రేషన్స్ అందరినీ బాగా ఆకట్టుకుంది. క్రికెటర్లు కూడా తమ సెలబ్రేషన్స్ లో తగ్గేదే లే అంటూ సందడి చేస్తున్నారు. తాజాగా మెల్ బోర్న్ టెస్టులో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సంచలన సెంచరీతో దుమ్మురేపాడు. ఈ మ్యాచ్ ఫిఫ్టీ చేసిన తర్వాత , సెంచరీ తర్వాత అతని సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. తన సెలబ్రేషన్స్ లో నితీశ్ తెలుగు సినిమాలను గుర్తు చేశాడు.

నితీశ్ కుమార్ రెడ్డి ఇదే మ్యాచ్‍లో తొలిసారి టెస్టు హాఫ్ సెంచరీ మార్క్ చేరాడు. ఫిఫ్టీ పూర్తవగానే పుష్ప సినిమా స్టైల్‍లో తగ్గేదేలే సిగ్నేచర్ స్టైల్ ను బ్యాట్‍తో చేశాడు. తద్వారా ఆటలో తాను తగ్గనని మేసేజ్ ఇచ్చేశాడు. అదే జోరుతో సెంచరీ పూర్తి చేశాడు.
నితీశ్ సెంచరీకి చేరిన సమయంలో బాహుబలి స్టైల్‍లో సెలెబ్రేట్ చేసుకున్నాడు. బ్యాట్‍ను నిలబెట్టి.. హ్యాండిల్‍పై హెల్మెట్ పెట్టాడు నితీశ్. తాను ఒక మోకాలిపై కూర్చొని చేతిని పైకి పెట్టి ఆకాశం వైపునకు చూశాడు. అలాగే నితీశ్ కుమార్ సెలెబ్రేషన్లకు సలార్ కూడా సింక్ అవుతోంది.

క్లైమాక్స్ ఫైట్‍లో ప్రభాస్ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ తర్వాత కత్తి పట్టుకొని ఓ మోకాలిపై కూర్చుంటాడు. ఒళ్లంతా రక్తంలో తడిచిపోయి ఉంటుంది. ఇదొక ఐకానిక్ పోజ్‍గా ఉంది. నితీశ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పోజ్ దీనికి కూడా సింక్ అవుతోంది. మొత్తంగా నితీశ్ కుమార్ సెలెబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు ఇది బాహుబలి సెలెబ్రేషన్స్ అంటుంటే.. కొందరు సలార్‌కు లింక్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో నితీశ్ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. డెబ్యూ సిరీస్ లోనే ఆకట్టుకున్న ఈ తెలుగు క్రికెటర్ ఎంసీజీలో జట్టును ఫాలో ఆన్ నుంచి తప్పించాడు. ఆసీస్ బౌలర్లకు షాకిస్తూ సెంచరీతో జట్టు స్కోరును ముందుకు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం 176 బంతుల్లో 105 పరుగుల వద్ద అజేయంగా ఉన్నాడు. మూడో రోజు ముగిసే సరికి భారత్ 9 వికెట్లకు 358 పరుగులుచేయగా…. నితీశ్105, సిరాజ్2 రన్స్ తో క్రీజులో ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ సపోర్ట్ తో నితీశ్ సెంచరీ చేయడమే కాదు జట్టు స్కోరును 350 దాటించాడు.