Sunrisers Hyderabad : నో డౌట్… టైటిల్ హైదరాబాద్ దే.. ఆ సెంటిమెంట్ తో ఫాన్స్ లో జోష్
ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలయింది. ఆదివారం చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కత్తా నైట్ రైడర్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి.

No doubt... The title is Hyderabad.. Josh in the fans with that sentiment
ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలయింది. ఆదివారం చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కత్తా నైట్ రైడర్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి. బలాబలాల పరంగా ఇరు జట్ల నువ్వా నేనా అన్నట్లు ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత ఫైనల్ చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇది నాలుగో టైటిల్ పోరు.
ఈ ఫైనల్‌లో కేకేఆర్‌పై విజయం సాధిస్తే తెలుగు టీమ్ ఖాతాలో మూడో టైటిల్ చేరుతుంది. 2009లో గిల్ క్రిస్ట్ నేతృత్వంలో డెక్కన్ ఛార్జర్స్ తొలిసారి ట్రోఫీని గెలిచింది. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్‌రైజర్స్ టీమ్ రెండో కప్ సాధించింది. అయితే ఒక సెంటిమెంట్ ప్రకారం చూస్తే సన్ రైజర్స్ టైటిల్ గెలవడం ఖాయమని ఫాన్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. 2009లో విజేతగా నిలిచిన డెక్కన్ ఛార్జర్స్ 2008 సీజన్‌లో పేలవప్రదర్శన చేసింది. తొలి సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచింది.
దీంతో రెండో సీజన్‌లో ఛార్జర్స్ గెలుస్తుందనే ఎవరూ ఊహించలేదు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుతంగా డెక్కన్ ఛార్జర్స్ ట్రోఫీని సాధించింది. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. గత సీజన్‌లో పదో స్థానంలో నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్ ఈ సారి ఫైనల్‌కు చేరింది. టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. 2009 సెంటిమెంట్‌తోనే 2024లోనూ సన్‌రైజర్స్ విజేతగా నిలుస్తుందని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది.