HEMA DRAMA : సినిమా ఛాన్సులుండవ్… అయినా రిచ్ మెయింటెన్సెన్స్

సినిమా ఛాన్సులు ఉండవు. ఎక్కడా సినిమాల్లో కనిపించరు. ఏడాదికి పట్టుమని పది సినిమాలు కూడా చేయరు. పోనీ సినిమాలు చేసినా ఒక మూవీకి 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం రాదు. కానీ రోజువారి జీవితం చూస్తే చాలా కాస్టీ లీ గా ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 25, 2024 | 01:00 PMLast Updated on: May 25, 2024 | 1:00 PM

No Film Chances But Rich Maintenance

సినిమా ఛాన్సులు ఉండవు. ఎక్కడా సినిమాల్లో కనిపించరు. ఏడాదికి పట్టుమని పది సినిమాలు కూడా చేయరు. పోనీ సినిమాలు చేసినా ఒక మూవీకి 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం రాదు. కానీ రోజువారి జీవితం చూస్తే చాలా కాస్టీ లీ గా ఉంటుంది. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే సమాధానం దొరకదు. ఎప్పుడో ఒకప్పుడు డ్రగ్ పార్టీ లోనో, రేవ్ పార్టీ లోనో దొరికినప్పుడు అందరికీ అర్థమవుతుంది. వీళ్లకు డబ్బులు ఎలా వస్తున్నాయో తెలుస్తుంది. కొందరు ఆర్టిస్టుల విషయంలో టాలీవుడ్ లో నిత్యం నడిచే టాక్ ఇదే.

బెంగళూరు రేవ్ పార్టీలో హేమ ఉందనీ… ఆమె డ్రగ్స్ కూడా తీసుకుందని బెంగళూరు పోలీసులే తేల్చి చెప్పేశారు. అసలు ఈ పార్టీ నిర్వహించిందే హేమా అని సమాచారం. చిత్రం ఏంటంటే తనకేమీ తెలియదని తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని హేమ రేవ్ పార్టీ జరిగిన బెంగళూరు ఫామ్ హౌస్ నుంచే వీడియో చేసి మరి పంపింది. ఎదవ పని చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా చేయాలన్నా జ్ఞానం కూడా లేదు హేమకి. ఏ ఫామ్ హౌస్ లో క్రైమ్ జరిగిందో అదే ఫామ్ హౌస్ నుంచి నేను అక్కడ లేను హైదరాబాదులో ఉన్నాను అని బుకాయిస్తే పబ్లిక్కు… పోలీసులు నవ్వుకోరా? ఆ తర్వాత మరో వీడియో చేసి… అందులో బిర్యానీ వండుతున్నట్టుగా చూపించి జనం కళ్ళకి గంటలు కట్టే ప్రయత్నం చేసింది హేమ. చివరికి బెంగళూరు పోలీసులు అన్ని వివరాలు బయట పెట్టేసరికి నా పేరు చెప్తారా… సూసైడ్ చేసుకుంటానంటూ బెదిరించింది. రేవ్ పార్టీలో దొరికి బ్లడ్ శాంపిల్స్ పోలీసులకు ఇచ్చి, తన అసలు పేరును కృష్ణవేణిగా చెప్పి బయటపడింది హేమ.

హైదరాబాదులో ఉన్నా.. బెంగళూరులో ఉన్నా.. ఫామ్ హౌస్ లో చిల్ అయ్యేటంత రిచ్ లైఫ్ స్టైల్… సినిమాల్లో పది …15 నిమిషాలు కనిపించే హేమ లాంటి నటికి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఇప్పుడు జనం ప్రశ్న. కేవలం హేమ మాత్రమే కాదు. టాలీవుడ్ లో కనీసం ఈ మిడిల్ రేంజ్ ఆర్టిస్టులు ఒక పదిమందికి నిత్యం ఇదే వ్యాపారం. ఇదే యవ్వారం. ముఖ్యంగా అక్క, వదిన, చెల్లెలు పాత్రలు వేసి మిడిల్ రేంజ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాల్లో బిజీగా ఉన్నంతకాలం బుద్ధిగానే ఉంటారు. అవకాశాలు తగ్గగానే పక్కదారి పట్టిపోతుంటారు. కొందరు ఇంకాస్త తెలివైన వాళ్ళు స్క్రీన్ పై ఒక వెలుగు వెలుగుతున్నప్పుడే నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనే తొందరలో, కొత్త కొత్త పరిచయాలు పెంచుకుంటూ క్లబ్బులు, పబ్బులు, పార్టీలు పేరుతో ఇలా వార్తల్లోకి వస్తూ ఉంటారు.

మరో నటి కూడా అంతే. అక్క పాత్రలకు పాపులర్ అయి. ఇండస్ట్రీలో పేరు సంపాదించినప్పటికీ ఎందుకో రెండేళ్లుగా సినిమాలకు దాదాపు దూరమైంది. ఏడాది క్రితం అనుకుంటా ఒక సినిమాలో కనిపించింది. నన్ను మీరే దూరం చేసుకుంటున్నారు. అవకాశాలు ఇస్తే నేనెందుకు చేయను అని పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఆ మధ్య ఒక నిర్మాత ఇచ్చిన డ్రగ్ పార్టీలో ఈ మిడిల్ రేంజ్ ఆర్టిస్ట్ కనిపించింది. ఆ తర్వాత నిర్మాత డ్రగ్ కేసులో అరెస్టు అయ్యాడు కూడా. హైదరాబాద్, బెంగళూరు లో జరిగే పెద్ద పెద్ద పార్టీలకు కూతురుతో కలిసి అటెండ్ అవుతుంది ఈ నటి. నిత్యం ఇన్ స్టాలో, FBలో వీర హడావిడి చేసే 40 వసంతాల నటి చిన్నచిన్న పొట్టి గౌన్లతో… కూతురుతో కలిసి వీడియోలు పెడుతూ జనాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది.

ఈమె లైఫ్ స్టైల్, తిరిగే కార్లు, అడపాదడపా బెంగళూరులో ఆమె కనిపించే పార్టీలు ఇవన్నీ చూస్తే ఎవరికైనా అనుమానం రాక మానదు. అసలు అంత రిచ్ మెయింటినెన్స్ కి ఎంతో కొంత ఆదాయం ఉండాలి కదా.? ఏడాదికి ఒక సినిమా చేసి… ఐదారు లక్షలు రెమ్యూనరేషన్ తీసుకొని… ఏడాది మొత్తం కోట్ల రూపాయల ఖర్చు అయ్యే మెయింటినెన్స్ ఎలా చేస్తారు అన్నది అర్థం కాని ప్రశ్న. హైదరాబాదులో ఖరీదైన అపార్ట్మెంట్, బీఎండబ్ల్యూ… బెంజ్ కార్లు, బెంగళూరులో ఖరీదైన హోటల్లో, ఫామ్ హౌస్ లో విలాసాలు, వీటన్నిటికీ వీళ్ళకి డబ్బు ఎక్కడినుంచి వస్తుంది? వీళ్లు వేసుకునే ఒక డ్రెస్ , కట్టుకునే ఒక చీర ఖరీదు కనీసం లక్ష రూపాయలు ఉంటుంది. ఎంత సంపాదన లేకపోతే ఇంత విలాసంగా జీవిస్తారు? ఈ నటి, ఆమె కుమార్తె అటెండ్ అయ్యే పార్టీలు, చేతిలో ఉన్న గ్లాసులు, వేసుకున్న డ్రస్సులు చూస్తే… వెయ్యి కోట్ల ఆసామి కూడా అంత రిచ్ గా మెయింటినెన్స్ చేయరు అని అనిపిస్తుంది.

ఇక మరో నటి పైనా ఇలాంటి ఆరోపణలే తరచూ వస్తుంటాయి. చేతిలో ఒక్క పాత్ర లేకపోయినా… మూడు నాలుగు ఏళ్లుగా తెరపై కనిపించకపోయినా రిచ్ మెయింటినెన్స్ లో ఎక్కడా తేడా రానీయరు. దీనికి ప్రధాన కారణం టాలీవుడ్ లో ఒక టాక్ వినిపిస్తోంది. చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ వేసే ఆర్టిస్టులు… పరిచయాలు పెరిగిన తర్వాత కేవలం ఇండస్ట్రీతో టచ్ కోసం స్క్రీన్ పై అడపా దడపా కనిపిస్తుంటారు. మిగిలిందంతా ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యవహారాలే. పార్టీలు… పబ్ లు ఇలా రకరకాల వ్యవహారాలతో ఆదాయ మార్గాలు పెంచుకుంటూ ఉంటారు. రియల్ ఎస్టేట్ బిల్డర్లు, ఇండస్ట్రియ లిస్టులు, బడా బాబుల కొడుకులు, ఎన్నారైలు వీళ్లే టార్గెట్. ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీని నిర్వహించడం, ఏమి కావాలంటే అవి సప్లై చేయడం. ఒక మనిషి నుంచి మరో మనిషి ద్వారా పరిచయాలు పెంచుకోవడం ఇది వీళ్లు నిత్యం చేసేది. అందుకే సినిమాల్లో కనిపించకపోయినా… సూపర్ రిచ్ మెయింటినెన్స్ మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు బెంగళూరు రేవు పార్టీలోనూ దొరికిన కూడా అంతే. టాలీవుడ్ లో ఇంకొంతమంది ఉన్నారు. వాళ్లనేదో తప్పు పట్టాలని … కించపరచాలని ఉద్దేశం కాదు. హై రేంజ్ లైఫ్ స్టైల్, రిచ్ మెయింటెనెన్స్… పార్టీ లైఫ్, పెద్ద పెద్ద పరిచయాలు ఇవన్నీ కావాలంటే అవన్నీ చేయక తప్పదు.