Narendra Modi : ఇల్లు లేదు, సొంత కారు లేదు.. మోడీ ఆస్తులు చూస్తే షాకౌతారు
దేశంలో పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) సందడి కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నాలుగో దశ లోక్ సభ ఎన్నికలు ముగిశాయి.

No house, no own car.. One will be shocked to see Modi's assets
దేశంలో పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) సందడి కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నాలుగో దశ లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఏడు దశల్లో జరుగనున్న ఈ ఎన్నికలు మరో మూడు దశల్లో పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడి నుంచి పోటీ చేయడం ఆయనకిది మూడోసారి. ఇక ఎన్నికల్లో పోటీచేసే ఏ రాజకీయ నాయకుడైనా స్థిర, చర ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు వెల్లడించాల్సిందే.
దీంతో మోడీ నామినేషన్ (Modi Nomination) దాఖలు సందర్భంగా తన ఆస్తులు, అప్పుల గురించి ఆ నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. మోడీ తన మొత్తం ఆస్తుల విలువ 3 కోట్ల 2 లక్షలు అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనకు సొంత ఇల్లు, కారు లేవని తెలిపారు. అంతే కాకుండా తన పేరు మీద ఎలాంటి షేర్లు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రధాని మోడీ దగ్గర 52 వేల 920 రూపాయల నగదు మాత్రమే ఉందట. ఆయన బ్యాంకు అకౌంట్‌లో 80 వేల 304 రూపాయలు ఉన్నాయట. మోడీకి 2 కోట్ల 85 లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇవేకాకుండా 2 లక్ష 67 వేల విలువైన 4 బంగారు ఉంగరాలు ఉన్నాయని తెలిపారు.
ఇక 9 లక్షల 12 వేలు.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ పథకంలో పెట్టుబడి పెట్టినట్లు మోడీ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి వచ్చే జీతం, బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ మాత్రమే తన ఆదాయ మార్గాలని మోడీ తెలిపారు. ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీ (BJP) లో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన మోడీ.. అంచలంచెలుగా ఎదిగి దేశ ప్రధాని అయ్యారు. 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా.. 10 ఏళ్లు దేశ ప్రధానిగా పని చేశారు. ఇప్పుడు మోడోసారి ప్రధాని అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతటి సుదీర్ఘ రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి పదవుల్లో పని చేసిన మోడీ ఆస్తుల విలువ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.