MOHAN BABU : సినిమాల్లేవు – పాలిటిక్స్ లేవు.. భ్రమల్లోనే మోహన్ బాబు
నా.. రూటే సపరేటు.. అంటూ సినిమా డైలాగుల్ని సెటైరికల్‌గా చెప్పే నటుడు మోహన్‌బాబుకు... ఇప్పుడు ఏ రూట్లో వెళ్ళాలో తెలియడం లేదా.. అంటే.. అవుననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. అందుకే కొన్నేళ్ళుగా ఆయన పొలిటికల్ మౌనం పాటిస్తున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్‌గా ఉండి.. ఆ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేసిన మోహన్‌బాబు గత ఎన్నికల టైంలో వైసీపీకి జై కొట్టారు. చంద్రబాబును ఓ రేంజ్‌లో టార్గెట్ చేసి మాటల తూటాలు పేల్చడంతో పాటు.. కాలేజీ ఫీజు బకాయిల చెల్లింపు పేరుతో రోడ్డెక్కి మరీ ఆందోళన చేశారాయన. వైసీపీ పవర్‌లోకి వచ్చాక జరిగిన మా ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుతోనే మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్నది ఆయన ప్రత్యర్ధి వర్గం ఆరోపణ. మొదట్లో బాగానే ఉందనుకున్నా.. టైం గడిచేకొద్దీ వైసీపీతో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారట మోహన్‌బాబు.
నా.. రూటే సపరేటు.. అంటూ సినిమా డైలాగుల్ని సెటైరికల్‌గా చెప్పే నటుడు మోహన్‌బాబుకు… ఇప్పుడు ఏ రూట్లో వెళ్ళాలో తెలియడం లేదా.. అంటే.. అవుననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. అందుకే కొన్నేళ్ళుగా ఆయన పొలిటికల్ మౌనం పాటిస్తున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్‌గా ఉండి.. ఆ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేసిన మోహన్‌బాబు గత ఎన్నికల టైంలో వైసీపీకి జై కొట్టారు. చంద్రబాబును ఓ రేంజ్‌లో టార్గెట్ చేసి మాటల తూటాలు పేల్చడంతో పాటు.. కాలేజీ ఫీజు బకాయిల చెల్లింపు పేరుతో రోడ్డెక్కి మరీ ఆందోళన చేశారాయన. వైసీపీ పవర్‌లోకి వచ్చాక జరిగిన మా ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుతోనే మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్నది ఆయన ప్రత్యర్ధి వర్గం ఆరోపణ. మొదట్లో బాగానే ఉందనుకున్నా.. టైం గడిచేకొద్దీ వైసీపీతో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారట మోహన్‌బాబు. ఆ మధ్య సినీ పరిశ్రమ సమస్యల విషయంలోనూ ప్రభుత్వం ఆయన్ని సంప్రదించింది లేదు. వైఎస్సార్ కుటుంబంతో మోహన్ బాబుకు బంధుత్వం ఉంది. ఆ క్రమంలోనే వైసీపీ అధికారంలోకి రాగానే.. ఆయనకు టీటీడీ ఛైర్మన్ లేదా రాజ్యసభ ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆ తరువాత ఫిలిం డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మన్ పదవి ఇస్తారన్న మాటలు కూడా వినిపించాయి. కానీ.. చివరికి ఏ చిన్న పదవి కూడా దక్కకపోవడంతో.. మోహన్‌బాబు అసంతృప్తితో ఉన్నారని, సైలెంట్ మోడ్‌లోకి వెళ్లి క్రమంగా పార్టీకి దూరం జరుగుతున్నారన్న వాదన వినిపిస్తోంది రాజకీయ వర్గాల నుంచి.
దీనికి తోడు గతంలో కాలేజీ ఫీజు బకాయిల కోసం చంద్రబాబుకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు మోహన్‌బాబు. కానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా అవి పూర్తి స్ధాయిలో రాలేదని సమాచారం. అదే సమయంలో అప్పుడు ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల కోసం చేపట్టిన ధర్నాకు సంబంధించిన కేస్ కోర్ట్‌లో నడుస్తోంది. ఆ కేసు విచారణ కోసం కోర్ట్‌కు కామ్‌గా హాజరయ్యే అవకాశం ఉన్నా.. అలా చేయకుండా ఒకసారి పాదయాత్రతో వచ్చి అందరి దృష్టి తన వైపునకు తిప్పుకున్నారు మోహన్‌బాబు. అంటే.. బంధువునైనా.. జగన్ ప్రభుత్వం తనకు సహకరించడం లేదని చెప్పదల్చుకున్నారా అన్న చర్చ అప్పట్లో జరిగింది. అదే సమయంలో.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకరినని అంటూ వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
గతంలో ప్రధానిని కలసినప్పుడు తనకు ఇచ్చిన గౌరవాన్ని మర్చిపోలేనంటూ ప్రశంసలు కురిపించారు మోహన్‌బాబు. దీంతో ఆయన కాషాయదళంలో చేరతారని అనుకున్నారు అంతా. కానీ.. అది కూడా జరగలేదు. ఆ తర్వాత ఆయన పొలిటికల్‌గా పూర్తిగా సైలెంట్ అయ్యారు. తర్వాత ఆయనకు భూమా ఫ్యామిలీతో కూడా బంధుత్వం కుదిరింది. భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనికను పెళ్ళి చేసుకున్నారు మంచు మనోజ్. పెళ్ళయిన కొత్తలో దంపతులు ఇద్దరూ వెళ్ళి చంద్రబాబును కలిశారు. ఈ పరిస్థితుల్లో.. ఇప్పుడిక ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న టైంలో పెదరాయుడి అడుగులు ఎటువైపు అన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. ఆయన కామ్‌గా ఉండిపోతారా? లేక గతంలోలాగే ఏదో ఒక స్టాండ్ తీసుకుంటారా అన్నది చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పుడున్న వైసీపీలోనే ఉంటారా? తాను పొగుడుతున్న బీజేపీ పంచన చేరతారా? లేక మారు మనసుతో చంద్రబాబుకు జై కొడతారా అన్నది వేచి చూడాల్సిందే.