2024 Sankranti Films : సంక్రాంతి బరిలో 8 సినిమాలు అసలు ఏం జరుగుతోంది.

సంక్రాంతి అంటే కామెడీ అయిపోయింది. 365 రోజుల్లో మరో డేట్‌ లేనట్టు.. అందరూ సంక్రాంతికే రావాలని ఫిక్స్‌ అయ్యారు. నాలుగైదు సినిమాలకు చోటుంటే.. ఎనిమిది మంది కర్చీఫ్‌ వేసేశారు. 2024 సంక్రాంతికి ఇంత డిమాండ్‌ వుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. గుంటూరు కారం.. హనుమాన్‌ వంటి సినిమాలు ముందే సంక్రాంతికి వస్తున్నట్టు ఎనౌన్స్‌ చేశాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 2, 2023 | 10:20 AMLast Updated on: Oct 02, 2023 | 10:20 AM

No One Could Have Imagined That There Would Be Such A Demand For Sankranti In 2024 Films Like Guntur Karam Hanuman Have Already Announced That They Are Coming To Sankranti

365 రోజుల్లో మరో డేట్‌ లేదా..?

సంక్రాంతి అంటే కామెడీ అయిపోయింది. 365 రోజుల్లో మరో డేట్‌ లేనట్టు.. అందరూ సంక్రాంతికే రావాలని ఫిక్స్‌ అయ్యారు. నాలుగైదు సినిమాలకు చోటుంటే.. ఎనిమిది మంది కర్చీఫ్‌ వేసేశారు.
2024 సంక్రాంతికి ఇంత డిమాండ్‌ వుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. గుంటూరు కారం.. హనుమాన్‌ వంటి సినిమాలు ముందే సంక్రాంతికి వస్తున్నట్టు ఎనౌన్స్‌ చేశాయి. ఆమధ్య కల్కి కూడా సంక్రాంతిని టార్గెట్‌ చేసినా.. షూటింగ్‌ పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. రిలీజ్‌ ఎప్పుడో చెప్పడం లేదు. సంక్రాంతికి రావాలి.. క్యాష్‌ చేసుకోవాలన్న థాట్‌ తప్ప మరోటి లేదు. థియేటర్స్‌ దొరుకుతాయా? లేవా? కాంపిటీషన్‌లో మన సినిమా తట్టుకుటుందా? లేదా? ఇవేవీ ఆలోచించడం లేదు. సడెన్‌గా రవితేజ ఈగల్‌ వచ్చి చేరింది. షూటింగ్ మొదలు కాకుండానే.. నాగార్జున ‘ నా సామి రంగా’ సంక్రాంతినే టార్గెట్‌ చేశారు. తెలుగు స్ట్రైట్‌ మూవీసే సంక్రాంతి ప్లేస్‌ కోసం కొట్టుకుంటుంటే.. అరవ హీరోలు ఒక్కొక్కరూ వచ్చి చేరుతున్నారు. శివ కార్తికేయన్‌ నటించిన ‘అయలాన్‌’ సంక్రాంతికి వస్తోంది. జైలర్‌ హిట్‌తో మాంచి ఊపు మీదున్న రజనీకాంత్‌ ‘లాల్‌ సలాం’తో వస్తున్నాడు. సంక్రాంతికి రిలీజ్‌ అంటూ లైకా ప్రొడక్షన్స్‌ రీసెంట్‌గా ఎనౌన్స్‌ చేసింది. ఇందులో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలు కాగా.. రజనీకాంత్‌ మాఫియా డాన్‌ ‘మొయిద్దీన్‌ భాయ్‌’గా కనిపిస్తాడు. సినిమా మొత్తం లేకపోయినా.. జైలర్‌ హిట్‌ లాల్‌ సలాంకు హైప్‌ తీసుకొచ్చింది.
సంక్రాంతికి ఇన్ని క్రేజీ మూవీస్‌కు చోటు వుందా? అంటే కచ్చితంగా లేదు. మూడు నాలుగు సినిమాలు వచ్చినా.. థియేటర్స్ పట్టిన నిర్మాతే హీరో కింద లెక్క.

2023 సంక్రాంతికి పెద్ద హీరోలు బరిలోకి దిగినా.. దిల్ రాజు నిర్మాత కావడంతో విజయ్‌ నటించిన వారసుడుకు ఎక్కువ థియేటర్స్‌ దొరికాయి. వచ్చే సంక్రాంతికి దిల్‌ రాజు విజయ్‌ దేవరకొండ మూవీతో రావడంతో.. థియేటర్స్‌ ఎక్కువ సినిమాలు ఈ ప్రొడ్యూసర్‌ వశం అయిపోతాయి. సంక్రాతికి వచ్చేస్తున్నామంటూ.. ఎంతగా చెప్పుకున్నా.. జనవరి మొదటివారం వరకే. ఆ తర్వాత చెప్పడానికి బరిలోకి దిగడానికి నాలుగైదు సినిమాలే వుంటాయి. 8 క్రేజీ సినిమాలు సంక్రాంతి వరలో ఇమడవు. మరి ఇమిడే ఆ నాలుగైదు సినిమాలు ఏమిటో ఇప్పట్లో తేలదు. అప్పటివరకు సంక్రాంతి లిస్ట్‌ పెరుగుతూనే వుంటుంది. ఆతర్వాత టప టప పడిపోతుంది.