Mohan Babu warning : నాతో పాలిటిక్స్ వద్దు.. మోహన్ బాబు వార్నింగ్
రాజకీయంగా తన పేరును కొందరు వాడుకుంటున్నారంటూ యాక్టర్ మోహన్ బాబు ఫైర్ అయ్యారు. ఈ మధ్య కాలంలో కొందరు వ్యక్తులు తన పేరును ఉపయోగించుకున్నట్టుగా తన దృష్టికి వచ్చిందంటూ ట్వీట్ చేశారు. ఏ పార్టీకి చెందిన నాయకులైనా సరే తమ సొంత ప్రయోజనాలకోసం తన పేరును వాడుకోవొద్దంటూ సూచించారు.
రాజకీయంగా తన పేరును కొందరు వాడుకుంటున్నారంటూ యాక్టర్ మోహన్ బాబు ఫైర్ అయ్యారు. ఈ మధ్య కాలంలో కొందరు వ్యక్తులు తన పేరును ఉపయోగించుకున్నట్టుగా తన దృష్టికి వచ్చిందంటూ ట్వీట్ చేశారు. ఏ పార్టీకి చెందిన నాయకులైనా సరే తమ సొంత ప్రయోజనాలకోసం తన పేరును వాడుకోవొద్దంటూ సూచించారు. అనేక రకాల భావావేశాలున్న వ్యక్తులు మధ్య మనం బుతుకుతున్నామని.. కాబట్టి ఒకరి అభిప్రాయాలకు ఒకరు ఖచ్చితంగా విలువ ఇవ్వాలని చెప్పారు. చేతనైతే పది మందికి సహాయపడండి కానీ.. ఇలా సొంత ప్రయోనాల కోసం సంబంధం లేని వారిని రాజకీయాల్లోకి, వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధగా ఉందంటూ చెప్పారు. తనకు ఇప్పటికూ సపోర్ట్‌గా ఉన్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పారు. ఇక నుంచి తన అనుమతి లేకుండా తన పేరును ఎవరు ఎక్కడ వాడుకున్నా లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే మోహన్ బాబు పేరును ఎవరు వాడుకున్నారు ఎక్కడ వాడుకున్నారు అనేవిషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు.
రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నాయకులు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పనులు చేస్తున్నారంటూ చెప్పారు. మరోసారి ఇది రిపీట్ ఐతే పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఏపీలో అధికార వైసీపీ నుంచి ఆయన పోటీ చేస్తారు అని కూడా చాలా మంది అన్నారు. మొదట్లో జగన్‌తో చాలా సన్నిహితంగా ఉన్న మంచు కుటుంబం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చింది. మోహన్ బాబు కూడా ఎప్పుడు ఎక్కడా పెద్దగా పొలిటికల్ కామెంట్స్ కూడా చేయలేదు. కానీ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు తన పేరును వాడుకుని కొందరు రాజకీయాలు చేస్తున్నారంటూ మోహన్ బాబు చెప్పడం ఇంట్రెస్టింగ్ పాయింగ్‌గా మారింది. అయితే వాళ్లు ఎవరు ఏంటి అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.