BRS SITTINGS : టిక్కెట్లు వద్దు బాబోయ్ ! బీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎంపీల దండం
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచీ బీఆర్ఎస్ (BRS) కు వరుస షాక్ లు తగులుతున్నాయి. లోక్ సభ ఎన్నికల ముందు ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఎంపీలుగా పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకట్లేదు. సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై కొడుతున్నారు. ఉన్నవాళ్ళేమో టిక్కెట్లు తీసుకోడానికి భయపడుతున్నారు. దాంతో కొత్త వాళ్ళని వెతుక్కోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ కు ఏర్పడింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచీ బీఆర్ఎస్ (BRS) కు వరుస షాక్ లు తగులుతున్నాయి. లోక్ సభ ఎన్నికల ముందు ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఎంపీలుగా పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకట్లేదు. సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై కొడుతున్నారు. ఉన్నవాళ్ళేమో టిక్కెట్లు తీసుకోడానికి భయపడుతున్నారు. దాంతో కొత్త వాళ్ళని వెతుక్కోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ కు ఏర్పడింది.
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిల్లో బీఆర్ఎస్ కు తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో ముగ్గురు ఇప్పటికే పార్టీకి గుడ్ బై కొట్టారు. ఒకరు కాంగ్రెస్ లో, ఇద్దరు బీజేపీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి నలుగురు పోటీకి దూరమవగా… మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక రిజైన్ చేశారు. బీఆర్ఎస్ కు ఐదుగురు అభ్యర్థులు లేనట్టే. చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, మానుకోట ఎంపీ కవిత కూడా తమకు టిక్కెట్ వద్దంటున్నారు. అసలే ఓడిపోయి మూలన కూర్చున్న పార్టీ… భారీగా డబ్బులు ఖర్చు పెట్టినా గెలుస్తామో… లేదో… అని చాలామంది సిట్టింగ్స్ మళ్ళీ పోటీకి వెనుకాడుతున్నారు. రంజిత్ రెడ్డి వారం రోజులుగా పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొనడం లేదు. పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. చేవెళ్ళ ఎంపీ సీటుకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరును బీజేపీ ప్రకటించింది. దాంతో రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరవచ్చని అంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ లో ఉన్నా… ఈసారి పోటీకి దూరంగా ఉండే ఛాన్సుంది.
మిగిలిన నలుగురు సిట్టింగ్స్ లో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, వరంగల్ పసునూరు దయాకర్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తారా…ఈసారి నిలబడే ఛాన్స్ ఉంటుందా అన్నది సస్పెన్స్ గా ఉంది. ఒక్క నామానే మళ్ళీ పోటీకి రెడీ అవుతున్నారు. మళ్ళీ పోటీ చేయమని పిలిచి టిక్కెట్ ఇస్తున్నా తీసుకోవట్లేదు. దాంతో గులాబీ బాస్ కేసీఆర్ మిగిలిన నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు. గతంలో పోటీ చేసిన ఓడిన వాళ్ళతో పాటు… మాజీ మంత్రులను దించడానికి ప్లాన్ చేస్తున్నారు. కరీంనగర్ లో బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు BRS టిక్కెట్లు కన్ఫమ్ అయ్యాయి. భారీగా ఖర్చుపెట్టి… పోటీ చేసినా గెలుస్తామో లేదో… అన్న డౌట్ చాలామందిలో ఉంది. అందుకే బీఆర్ఎస్ టిక్కెట్లు తీసుకోడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మొత్తానికి 10యేళ్ళపాటు తిరుగులేకుండా పరిపాలించిన బీఆర్ఎస్… ఇప్పుడు అభ్యర్థులు లేక దిక్కులేని తోచని పరిస్థితిల్లో ఉంది.