Jaya Prada: జయప్రదను అరెస్ట్ చేయండి.. పోలీసులకు కోర్టు ఆదేశం
ఆ పాలిటిక్సే ఇప్పుడామెను కటకటాల్లోకి నెడుతున్నాయి. వరుస కేసులతో కొన్నిరోజులుగా జయప్రద బయటకు కనిపించడం లేదు. తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలతో జయప్రద ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Jaya Prada: మాజీ ఎంపీ, నటి జయప్రద జైలుకెళ్ళక తప్పేలా లేదు. ఆమెను అరెస్ట్ చేయాలంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఉత్తరప్రదేశ్ లోని కోర్టు. గ్లామర్ ఉండగానే రాజకీయాలు చేద్దామని ప్రయత్నించింది. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పింది. మొదట సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2019లో బీజేపీలో చేరింది జయప్రద. కానీ ఆ పాలిటిక్సే ఇప్పుడామెను కటకటాల్లోకి నెడుతున్నాయి. వరుస కేసులతో కొన్నిరోజులుగా జయప్రద బయటకు కనిపించడం లేదు.
YV Subba Reddy: ఏపీ రాజధానిగా హైదరాబాద్.. ఏపీలో రాజధాని నిర్మించే పరిస్థితి లేదు: వైవీ సుబ్బారెడ్డి
తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలతో జయప్రద ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు వరుస షాక్లు తగులుతున్నాయి. ESIకి సంబంధించిన కేసులో ఆమెకు ఈమధ్యే జైలు శిక్షపడింది. లేటెస్ట్ గా మరో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2019లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. వాటి విచారణకు ఆమె హాజరు కావడం లేదు. దాంతో ఆమెను అరెస్ట్ చేసి ప్రజాప్రతినిధుల కోర్టు ముందు హాజరు పరచాలని రాంపుర్ SPకి ఆదేశాలు ఇచ్చింది ప్రజాప్రతినిధుల కోర్టు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు జయప్రద. ఆ టైమ్‌లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు ఉన్నాయి. 2019లో ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా.. జయప్రద యూపీలో ఓ రోడ్డును ప్రారంభించడంతో కేసు నమోదైంది. ఇది కాకుండా.. బహిరంగ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నది రెండో కేసు. వాటిపై ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది.
విచారణ హాజరు కావాలని జయప్రదకు అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. అంతకుముందు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు.. జయప్రదను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. పోలీసులు జయప్రద కోసం ఢిల్లీ, ముంబైలో ప్రత్యేక బృందాలు పెట్టి వెతికిస్తున్నారు. అయినా ఆమె ఆచూకీ దొరకడం లేదు. ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఇప్పటి వరకు ఏడుసార్లు వారెంట్ జారీ చేసినా.. జయప్రద బయటకు కనిపించకుండా అజ్ఞాతంలోనే ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేయడంలో విఫలమయ్యారని కోర్టు దృష్టికి తెచ్చారు ప్రభుత్వ న్యాయవాది. దాంతో సీరియస్ అయిన ప్రజాప్రతినిధుల కోర్టు.. జయప్రదను వెంటనే అరెస్ట్ చేసి తీసుకురావాలని యూపీ పోలీసులను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది కోర్టు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో మంచి పేరు సాధించిన జయప్రద.. చివరకు కోర్టు కేసులతో తప్పించుకొని తిరుగుతోంది. యూపీ పోలీసులు ఆమె కోసం కొన్నాళ్ళుగా వెతుకుతూనే ఉన్నారు. జయప్రదను ఈ నెలాఖరు లోగా అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.