ఏపీలో ఆగని ఫ్యాక్షన్, కర్నూలులో దారుణం…!
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ – వైసీపీ మధ్య దాడుల తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తుంటే టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ దాడులకు దిగుతుంది. తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీ కార్యకర్తలు కొందరు టీడీపీ నేతను హత్య చేసారు. పత్తికొండ మండలం హోసూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.
టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. కళ్లలో కారం పొడి చల్లి వేట కొడవళ్ళతో నరికారు. హోసురులో టీడీపీకి భారీ మెజార్టీ తేవడంలో శ్రీనివాసులుది కీలక పాత్ర. ఈ ఘటనతో హోసూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీగా పోలీసుల మొహరించారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.