FORMULA E – RACE : 54 కోట్లు కాదు… 200 కోట్లకు ప్లాన్ ! ఫార్ములా రేస్ లో నమ్మలేని నిజం
ఫార్ములా ఈ – రేస్ పై నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఈ రేసులో ఈ ఏడాది 54 కోట్ల రూపాయలను నిర్వాహకులకు కట్టబెట్టారు సీనియర్ IAS అధికారి అర్వింద్ కుమార్. అసలు ఈరేస్ నిర్వహణలో ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే. అంటే సౌకర్యాలను మాత్రమే కల్పించాలి. కానీ సొమ్ము ఒకడిది.. సోకొకడిది అన్నట్టు.. రేసు నిర్వహణలో ప్రజల సొమ్మును అప్పనంగా దోచిపెట్టారు ఆ అధికారి.
ఫార్ములా ఈ – రేస్ పై నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఈ రేసులో ఈ ఏడాది 54 కోట్ల రూపాయలను నిర్వాహకులకు కట్టబెట్టారు సీనియర్ IAS అధికారి అర్వింద్ కుమార్. అసలు ఈరేస్ నిర్వహణలో ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే. అంటే సౌకర్యాలను మాత్రమే కల్పించాలి. కానీ సొమ్ము ఒకడిది.. సోకొకడిది అన్నట్టు.. రేసు నిర్వహణలో ప్రజల సొమ్మును అప్పనంగా దోచిపెట్టారు ఆ అధికారి. అసలు ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి లాభం లేదంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 54 కాదు 200 కోట్ల దాకా ఈ-రేస్ కు ఖర్చుపెట్టే ప్రయత్నాలు జరిగాయని తెలియడం సంచలనం కలిగిస్తోంది.
ఫార్ములా రేస్ కోసం గత ప్రభుత్వం పాల్పడి కోట్ల రూపాయల దోపిడీ సంగతిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బయటపెట్టారు. ఫార్ములా ఈరేస్ రద్దుతో ఏదో నష్టం జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్.. ఇతర మంత్రులు గగ్గోలు పెడుతున్నారు. అసలు ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకున్నా ఈరేస్ ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు భట్టి. మీ కోరికలు తీర్చుకోడానికి జనం సొమ్ము ఖర్చుపెడతారా. ఏజెన్సీ టిక్కెట్లు అమ్ముకొని పోయింది. ఫార్ములా సంస్థ… రేస్ పెట్టుకొని పోయింది. దీనికి అనుమతి ఇచ్చి మీరేమో అధికారం కోల్పోయారు అని మండిపడ్డారు. ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తే సహించం.. లీగల్ గా పోరాడతాం.. తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోబోమని కేటీఆర్ ను హెచ్చరించారు భట్టి.
ఫార్ములా ఈ రేస్ లో సీజన్ 9 నిర్వహణకు HMDA 20 కోట్లు ఖర్చు పెట్టింది. రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కోసం ప్రభు సొమ్మును వాడారు. Next Gen అనే ప్రైవేట్ సంస్థ స్టాల్స్, ప్రచారం, సీటింగ్, స్ట్రీట్ లైట్స్ లాంటి వాటికి 150 కోట్లు ఖర్చు చేసింది. మరో 30కోట్లను హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ ఖర్చు పెట్టింది. సీజన్ 9లో రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్కో, ఫార్ములా-E అని మూడు పార్టీలు ఉన్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరపున HMDA కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే. అంటే ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేయడమే తప్ప.. రేస్ మీద వచ్చే లాభ నష్టాలతో సంబంధం లేదు. అయితే సీజన్ 9లో ఫార్ములా ఈ రేసును ప్రమోట్ చేసిన గ్రీన్కోకు భారీ నష్టం వచ్చింది. అందుకే సీజన్ 10లో ప్రైవేట్ ప్రమోటర్ గా ఉన్న గ్రీన్కోను తప్పించి మిగతా పార్టీలు ఒప్పందం చేసుకున్నాయి. ఇది రాష్ట్రప్రభుత్వం ప్రమేయం లేకుండానే జరిగింది. ఈ ఒప్పందానికి ఎలాంటి చట్టబదత లేదు. కేబినెట్ ఆమోదం లేదు. ముఖ్యమంత్రికి కూడా తెలియదు.
ఫార్ములా-ఈ రేస్ సీజన్ 10 ఇంకా జరక్కముందే అక్టోబర్ లోనే 54 కోట్ల రూపాయలను HMDA నుంచి IAS ఆఫీసర్ అర్వింద్ కుమార్ చెల్లించారు. ఆ టైమ్ లో ఎన్నికల కోడ్ ఉండగా.. ప్రభుత్వ అనుమతి లేకుండా చెల్లించారు. ముఖాముఖి చర్చలు జరక్కుండా.. కేవలం ఈమెయిల్స్ ద్వారా సంప్రదింపులు జరిపి ప్రభుత్వానికి తెలియకుండా డబ్బులు ఇచ్చేశారు అర్వింద్ కుమార్. ఈ ఒప్పందం వల్ల HMDAపై 200 కోట్ల రూపాయల భారం పడేది. ఈ అగ్రిమెంట్ ఓ అధికారి వ్యక్తిగతంగా కుదుర్చుకున్నట్టు ఉందే తప్ప.. తమకు సంబంధం లేదంటోంది కాంగ్రెస్ సర్కార్. అందుకే అర్వింద్ కుమార్ అవినీతికి పాల్పడినట్టుగా భావించిన ప్రధాన కార్యదర్శి…ఆయనకు నోటీసులు ఇచ్చారు. మరి ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకపోయినా ఫార్ములా ఈరేస్ ను ఎందుకు నిర్వహించినట్టు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పినట్టుగా.. మాజీ మంత్రి కేటీఆర్, ఆయన ఫ్రెండ్స్ సరదా కోసమే నిర్వహించారా ? అందు కోసం ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేశారా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వం ఖర్చుపెట్టిన సొమ్మును రికవరీ చేయాలనీ.. ఆ అధికారిని సస్పెండ్ చేసి.. బాధ్యులైన మంత్రుల నుంచి సొమ్ము రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.