Hema : హేమకు మళ్లీ నోటీసులు.. అరెస్ట్ ఖాయమా.. టాలీవుడ్ వీఐపీలకు టెన్షన్..
బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rave Party) కేసులో విచారణకు రావాలని టాలీవుడ్ (Tollywood) నటి హేమకు (Tollywood Actors) పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

Notices again for Hema.. Is the arrest certain.. Tension for Tollywood VIPs..
బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rave Party) కేసులో విచారణకు రావాలని టాలీవుడ్ (Tollywood) నటి హేమకు (Tollywood Actors) పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. రేవ్ పార్టీ (Rave Party) లో పోలీసులకు డ్రగ్స్ (Drugs) కూడా దొరకడంతో.. ఆ పార్టీలో పాల్గొన్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. వారిలో 86మంది రక్తనమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. వీరిలో నటి హేమ ఒకరు.
దీంతో ఈనెల 27న విచారణకు రావాలని హేమకు బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే హేమ విచారణకు హాజరు కాలేదు. వైరల్ ఫివర్‌తో బాధపడుతున్నానని.. ప్రస్తుతం విచారణకు రాలేనని చెప్పారు. విచారణకు హేమతో పాటు మిగతావారు కూడా ఎవరూ హాజరుకాకపోవడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఇద్దరు కార్ ఓనర్లకు, ఎమ్మెల్యే కాకాని కార్ స్టిక్కర్ ఉన్న కార్ ఓనర్‌కు నోటీసులు జారీ చేశారు. మొత్తం 86 మందికి మరోసారి సీసీబీ పోలీసులు వివిధ తేదీల్లో విచారణకు రావాలని నోటీసులిచ్చారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలని హేమతోపాటు మరికొందరికి నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, జూన్ 1వ తేదీన విచారణకోసం హేమ బెంగళూరు వెళ్తారా ఈసారి కూడా ఏదైనా కారణం చెప్పి విచారణకు వెళ్లకుండా తప్పించుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఈసారి కూడా హాజరుకాకపోతే.. పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుంది.. అరెస్ట్ ఖాయమా అనే చర్చ జరుగుతోంది. ఇక అటు హేమ నోరు విప్పితే.. రేవ్ పార్టీకి సంబంధించిన కీలక బాగోతాలు బయటకు వచ్చే చాన్స్ ఉంది. నిజానికి ఆ పార్టీలో ఇంకా చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారనే టాక్ ఉంది. దీంతో విచారణకు హాజరయి.. హేమ ఏం చెప్తారని… టాలీవుడ్‌లో కొందరు ప్రముఖులు టెన్షన్ పడుతున్నారని టాక్. ఇక అటు హేమను కేసు నుంచి తప్పించాలంటూ.. పెద్ద తలకాయలు బెంగళూరు పోలీసుల మీద ఒత్తిడి తెచ్చారనే ప్రచారం జరిగింది. దీని గురించి హేమను ప్రశ్నిస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్.