November 30 : తెలంగాణలో నవంబర్ 30 పనిదినంగా ప్రకటన.. హైకోర్టుకు సైతం సెలవు
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఈనెల 30న హైకోర్టుకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నికలు మరి కొన్ని రోజుల్లోనే ఉన్నాయి..

November 30 has been announced as a working day in Telangana.. High Court is also a holiday
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఈనెల 30న హైకోర్టుకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నికలు మరి కొన్ని రోజుల్లోనే ఉన్నాయి.. దీంతో ఈ నెల 30న రాష్ట్రంలో పొలింగ్ జరగనుంది. శనివారం రిజిస్టర్ జనలర్ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టుతో పాటు జ్యుడీషియల్ అకాడమీ, లీగల్ సర్విసెస్ అథారిటీ, లీగల్ సర్విసెస్ కమిటీ, మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు ఈ సెలవు వర్తిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలు, దుకాణాలు, సంస్థలలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు కార్మికశాఖ తెలిపింది.
ఈ సెలవు నేపథ్యంలో డిసెంబర్ 16 (శనివారం)ను పనిదినంగా ప్రకటించారు. న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టుల సిబ్బందికి సమాచారం కోసం ప్రకటన విడుదల చేసినట్లు వెల్లడించారు.