Ambani Family : అంబానీ మనవళ్లు IVF ద్వారా పుట్టారా ?
ఇప్పుడు దేశమంతా అంబానీ ఫ్యామిలీ గురించే మాట్లాడుకుంటోంది. అనంత్ అంబానీ పెళ్లి గురించి కొందరు డిస్కషన్ మొదలుపెడితే.. పెరిగిన జియో రేట్ల గురించి ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు.

Now the whole country is talking about the Ambani family.
ఇప్పుడు దేశమంతా అంబానీ ఫ్యామిలీ గురించే మాట్లాడుకుంటోంది. అనంత్ అంబానీ పెళ్లి గురించి కొందరు డిస్కషన్ మొదలుపెడితే.. పెరిగిన జియో రేట్ల గురించి ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు. అనంత్ పెళ్లి కోసం మా జేబులు గుల్ల చేస్తున్నావా అంబానీ బాబాయ్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఐతే అంబానీ గారాల పట్టి, ఒక్కగానొక్క కూతురు ఇషా అంబానీ బయటపెట్టిన ఓ సంచలన విషయం.. ఆ రెండు విషయాలకు మించి హాట్‌టాపిక్‌గా మారింది.
ఇషా చెప్పిన మాటలు విని.. ఇప్పుడు ప్రతీ ఒక్కరు అవాక్కవుతున్నారు. ఇషా అంబానీ కూడా తన తల్లి నీతాలానే కవలలకు జన్మనిచ్చింది. ఐతే ఐవీఎఫ్ ద్వారానే తాను తల్లి అయ్యానని.. కవలలకు జన్మనిచ్చానని ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది ఇషా. ఇక ఐవీఎఫ్ విధానం గురించి ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. ఐవీఎఫ్ పద్ధతి చాలా కష్టంగా అనిపించిందని.. తను చాలా అలిసిపోయానని చెప్పుకొచ్చింది. ఐవీఎఫ్ గురించి మాట్లాడటానికి గానీ ఎలాంటి మొహమాటం అవసరం లేదు అని కుండబద్దలు కొట్టింది. నేటి ప్రపంచంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటే పిల్లల్ని కనడానికి దాన్ని ఎందుకు యూజ్ చేసుకోకూడదని ప్రశ్నించింది ఇకా.. ఇది మీరు ఆనందించే విషయం కానీ, దాచాల్సిన విషయం కాదని తన మాటలతో స్ఫూర్తి నింపింది. ముకేశ్ అంబానీ ముద్దుల కూతురు అయిన ఇషా అంబానీ… 2018 డిసెంబర్‌లో ఆనంద్ పిరమాల్‌ను పెళ్లి చేసుకుంది.
ఈ జంట 2022 నవంబర్ 19న కవలలకు జన్మనిచ్చింది. వీరికి ఆదియా శక్తి, కృష్ణ అని పేర్లు పెట్టారు. ఈ ఇద్దరు పిల్లలంటే ముఖేష్ అంబానీకి చాలా ప్రేమ. ఐతే ఇప్పుడు ఇషా బయటపెట్టిన విషయంతో.. అంబానీ మనవళ్లు ఇలా పుట్టారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇషా మాటలకు ఫిదా అయిపోయారు. ఐవీఎఫ్ మీద అవగాహన కల్పించేలా మాట్లాడిన మాటలపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.