America: బియ్యంకోసం ఎగబడుతున్న ఏన్నారైలు..
అమెరికాలో ఎన్నారైలను బియ్యం కష్టాలు వెంటాడుతున్నాయి. మార్కెట్‌లో బియ్యానికి కొరత ఏర్పడటంతో సూపర్ మార్కెట్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఒక్క ప్యాకెట్ దొరికినా చాలు అన్నట్టు ఆశగా ఎదురుచూస్తున్నారు. అన్ని సూపర్ మార్కెట్లు అమాంతం బియ్యం రేట్లు పెంచేస్తే.. కొన్ని మార్కెట్లలో ఏకంగా లిమిట్ విధించారు. ఒక్కరికి ఒక్క ప్యాకెట్ మాత్రమే అమ్ముతున్నారు. అది కూడా డబుల్ రేట్‌కి. అసలు అమెరికాలో బియ్యానికి ఇంత డిమాండ్ ఏర్పడటానికి కారణమేంటి.

NRIs are running for rice in America as the export of Indian rice has been stopped
అమెరికాలో ఎన్నారైలు బియ్యం కోసం బారులు తీరుతున్నారు. సూపర్ మార్కెట్ల ముందు క్యూలు కడుతున్నారు. పనులన్నీ వదిలిపెట్టుకుని బియ్య కోసం పడిగాపులు కాస్తున్నారు. రాత్రిదాకా వెయిట్ చేసైనా సరే నాలుగు ప్యాకెట్లు వేసుకుని వెళ్లాల్సిందే అని పోటీ పడుతున్నారు. అమెరికాలో తెలుగు పాపులేషన్ ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇదే సీన్ కనపిస్తోంది. విదేశాలకు బియ్యం ఎగుమతిని నిషేదిస్తున్నట్టు భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించడమే ఇందుకు కారణం.
అవును.. ఇన్ని రోజులు విదేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేసిన ఇండియా.. ఇప్పటి నుంచి బియ్యం ఎగుమతిని నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం బాస్మతి బియ్య మాత్రమే ఇంతకు ముందులా ఎక్స్‌పోర్ట్ అవుతుంది. మిగిలిన అన్ని రకాల బియ్యం ఇప్పటి నుంచి ఇండియా దాటి బయటకి వెళ్లవు. దీంతో విదేశాల్లో బియ్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మొన్నటి వరకూ 10 కేజీల బియ్య ప్యాకెట్ ధర అమెరికా 20 డాలర్లు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కో ప్యాకెట్ 50 డాలర్లకు అమ్ముతున్నారు. నిజానికి బియ్యానికి అంతర్జాతీయంగా ఇంత డిమాండ్ ఏర్పడేది కాదు. కానీ రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమ ఎగుమతి, దిగుమతులు తట్టిపోయాయి. ఈ గోధుమలను బియ్య రీప్లేస్ చేశాయి.
కానీ ఇప్పుడు బియ్యాం ఎగుమతిని నిలిపివేస్తున్నట్టు ఇండియా ప్రకటించడంతో ఒక్కసారిగా మార్కెట్‌లో బియ్యానికి డిమాండ్ ఏర్పడింది. ఇండియాలో బియ్యం డొమెస్టిక్ నిల్వలను కాపాడుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు బియ్యం ఎగుమతులను ఆపకపోతే ఇండియన్ మార్కెట్‌లో కూడా బియ్యానికి కొరత ఏర్పడే ప్రమాదముంది. ఇండియాలో చాలా మందికి వరి ప్రధాన ఆహారం. అలాంటి ఇండియన్ మార్కెట్‌లో బియ్యానికి కొరత ఏర్పడితే చాలా కష్టం. ఈ కారణంగా డొమెస్టిక్ నిల్వలను కాపాడుకునేందుకు ఇండియా బియ్యం ఎక్స్‌పోర్ట్‌ను నిలిపివేసినట్టు సామాచారం.