Sujith: చొక్కా విప్పిన.. ఫ్యానే డైరెక్టర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ మూవీ తీస్తున్న సుజీత్ నిజానికి పవన్ ఫ్యాన్. 2012 లో గబ్బర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు చొక్కా విప్పి గంతేశాడు. ఆసినిమా హిట్టైనందుకు ఒక అభిమానిగా హంగామా చేశాడు. కట్ చేస్తే ఆతర్వాత రెండేళ్లకు రన్ రాజా రన్ అంటూ సినిమా తీసి దర్శకుడయ్యాడు.

OG movie director Sujith is making the movie as a fan of Pawan Kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ మూవీ తీస్తున్న సుజీత్ నిజానికి పవన్ ఫ్యాన్. 2012 లో గబ్బర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు చొక్కా విప్పి గంతేశాడు. ఆసినిమా హిట్టైనందుకు ఒక అభిమానిగా హంగామా చేశాడు. కట్ చేస్తే ఆతర్వాత రెండేళ్లకు రన్ రాజా రన్ అంటూ సినిమా తీసి దర్శకుడయ్యాడు.
అప్పటి నుంచే పవన్ తో సినిమా తీయాలనుకున్నాడు. ఐతే ప్రభాస్ తో మూవీ ఛాన్స్ దొరకటం సాహో తీయటం జరిగింది. ఆతర్వాత ఇన్నాల్లకు పవన్ తో ఓజీ అంటూ సినిమా తీసే అవకాశం దక్కింది. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే ఓ అభిమానిగా పవన్ ని తోటి అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాడు. ఓజీ గ్లింప్స్ తో ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించాడు.
అచ్చంగా ఇలానే గతంలో కూడా జరిగింది. కాకపోతే దర్శకుడు మారాడు. పవన్ ఫ్యాన్ అయిన సుజీత్ పవర్ స్టార్ తో ఓజీ తీసి షాక్ ఇస్తే, ఇలానే పవర్ స్టార్ అభిమాని అయిన హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తీసి తన అభిమానం చాటుకున్నాడు. గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో కూడా మెగాస్టార్ ఇదే విషయాన్ని చెప్పాడు. పవన్ అభిమానులు తమ హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో అలానే తెరకెక్కించే లెవల్ కి ఎదిగారన్నాడు.
ఆ సినిమా వచ్చిన 11 ఏళ్లకు పవన్ మరో ఫ్యాన్ అయిన సుజీత్ ఇప్పుడు ఓజీతీస్తున్నాడు. ఇలాంటి అరుదైన సంఘటనలు తెలుగులోనే కాదు, మరే ఇండస్ట్రీలో జరగలేదు. ఓ అభిమాని తనే దర్శకుడై నచ్చిన హీరోని మరింత నచ్చేలా సినిమా తీయటం ఓ హిస్టరీ.