September 17 : సెప్టెంబర్ , 17 , 1948. { విమోచనమా , విలీనమా , విద్రోహమా } అసలేంటి ఆరోజు.. ?

1947 ఆగస్టు 15న భారత దేశం మొత్తం ఆనందంతో మునిగిపోయింది. కానీ ఇప్పటి తెలంగాణ అప్పటి హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వతంత్రం రాలేదు. భారత దేశన్నికి స్వాతంత్య్ర వచ్చిన హైదరాబాద్ కు మాత్రం 1948 సెప్టెంబర్ 17 నా.. రాత్రి 7:32 నిమిషాలకు స్వాతంత్య్ర వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 17, 2023 | 12:10 PMLast Updated on: Sep 17, 2023 | 12:16 PM

On August 15 1947 The Entire Nation Of India Was Overwhelmed With Joy But Now Telangana Did Not Get Independence For The Then Hyderabad State Hyderabad Got Independence For India On September 17 1948

స్వాతంత్య్ర వచ్చిన.. చీకటిలో మగ్గిన తెలంగాణ రోజులు 

కాసేపు చరిత్రలోకి వెళితే అది 1947 వ సంవత్సరం, ఆ రోజు బ్రిటిష్ పాలన నుంచి మన దేశం స్వతంత్రం పొందిన రోజు దేశం అంతటా త్రివర్ణ పతాకంతో ఆనందంతో మునిగిపోయారు. తమ స్వేచ్ఛను ఆనందంతో సగర్వంగా చాటి చెప్పారు దేశ ప్రజలందరూ. దేశం మొత్తం ఆనందంతో మునిగిపోయింది. కానీ ఇప్పటి తెలంగాణ అప్పటి హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వాతంత్య్ర  రాలేదు.. కారణం బ్రిటిష్ వారు పోతూ పోతూ దేశంలో ఒక చిచ్చు పెట్టి పోయారు. అది కేవలం రాజులు రాజ్యాధికారం, సంస్థలకు మాత్రమే వర్తించునని చెప్పాడు. ఇండియన్ యూనియన్ లో ఈ రాజ్యాధికారపు సంస్థానాలన్నీ మీరు స్వతంత్రంగా గాని ఉండవచ్చు, భారత యూనియన్ లో ను కలవచ్చు అని వారికి స్వేచ్ఛ ఇచ్చాడు. అప్పటికి దేశంలో చిన్న చితుకు కలిపి 550 సంస్థానాలు ఉండేవి కొన్ని స్వతంత్రంగా ఇండియన్ యూనియన్ లో కలిసిపోయాయి కొన్ని భారతపు సైన్య చొరవతో కలిసిపోయాయి. కానీ భారతదేశంలో అతిపెద్ద సంపన్నుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్, రాజ్యసంస్థానం అయిన హైదరాబాద్ ఒక స్వతంత్ర దేశంగా ఉండిపోయింది. దానికి ఒక ప్రధాని కూడా నియమించుకున్నాడు నిజాం రాజు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 13 నెలలు అవుతున్న హైదరాబాద్ మాత్రం ఇంకా రాజరికపు వ్యవస్థ లో నిజాం పాలన లో (మగ్గుతుంది) కొనసాగుతుంది. మేము ఇండియన్ యూనియన్ లో విలీనం కాము అని తేల్చి చెప్పేశాడు నిజాం రాజు. ( మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ )

హైదరాబాద్ నిజాం రాజు ( మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ) రాజీనామా..

1947 ఆగస్టు 15న భారతదేశంలో స్వతంత్రం వచ్చిన అనంతరం భారత ఉప ప్రధాని, హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో నిజాం పాలన నుంచి హైదరాబాద్ ను భారత యూనియన్ లో కలపాలని ( ఆపరేషన్ పోలో ) అనగా పోలీస్ చర్యతో భారత సైన్యాం హైదరాబాద్ ను మూడు దిక్కుల నుంచి చుట్టుముట్టి నిజాం రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు ముచ్చమటలు పట్టించింది భారత సైన్యం. బాధతో భావోద్వేగంతో అతనికి లొంగిపోవడం తప్ప మరో మార్గం లేకపోవడంతో నిజాం రాజు అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి హైదరాబాద్ ప్రధాని తో రాజీనామా చేయించి తాను లొంగిపోతున్నట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ప్రకటన ఇచ్చి దానిపై ఇరువురు సంతకాలు చేశారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం రాజుతో దక్కన్ రేడియోలో తన పాలన వ్యవస్థకు నాంది పలుకుతున్నట్లు రాజీనామా చేస్తు ఆ రాత్రి కింగ్ కోఠి లోని తన ప్యాలెస్ లో రేడియోలో తన ప్రకటను ప్రకటించాడు. 1948 సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ లో భాగంగా ఉన్న కర్ణాటక ప్రాంతానికి చెందిన బీదర్, మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన మరాఠ్వాడా ప్రాంతాలు, కూడా తమ తమ రాష్ట్రాల్లో కలిసిపోయాయి. ప్రజలందరూ స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్నాము. జాతీయ జెండాను పట్టుకుని వీధి వీధిలో విహరిస్తూ త్రివర్ణ పతాకంతో హైదరాబాద్ యువత, జాతీయ గీతాలాపన చేసి కేరింతలతో గంతులు వేశారు .

బీఆర్ఎస్ వాదన..

2013-14 తెలంగాణ ఉద్యమ సమయంలో (తెరాస) ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవం గా జరుపుతామని మాట ఇచ్చారు . అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నేటికీ కేసీఆర్ సర్కార్ అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరపలేదు. ఇదే విషయంపై ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ ను అసెంబ్లీ సాక్షిగా అడిగినప్పుడు ఆయన ఈ విషయాన్ని చాలా తేలికగా కొట్టిపరేశారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కారు సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవం జరపడం లేదు అని ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు దీనిని విలీన దినోత్సవంగా జరపాలని కోరారు.

కేసీఆర్ విమోచన దినోత్సవం జరగకపోవడానికి కారణం..

  • కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు గవర్నమెంట్ ఫార్మ్ చేసే ఎమ్మెల్యేల బలం దాదాపు ఉంది. రెండవసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లి, ముస్లిం పార్టీ అయిన MIM నీ మిత్రపక్షంగా కలుపుకోని స్వతాగా ప్రభుత్వ ని ఏర్పాటు చేశారు.
  • నిజానికి కేసీఆర్ విమోచన దినోత్సవం జరపాలంటే నిజాం కు వ్యతిరేకంగా మాట్లాడాలి అందుకు నిజాం ను కేసీఆర్ దూషించాలి. నిజాం చేసిన దుర్మార్గపు చర్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి . ఇలా చెస్తే ముస్లిం వర్గం నుంచి తమ ప్రభుత్వాని వ్యతిరేకిస్తుంది. రాజకీయ లబ్ధి కోసం ఒక ముస్లిం వర్గానికి చెందిన నిజాం పాలకుల్ని ( తిట్టలేక ) దూషించలేక ఇటు మిత్రపక్షమైన AMIM పార్టీని వదులుకోలేక ఇరుకునపడ్డాడు కేసీఆర్.
  • గతంలోనూ కేసీఆర్ గారు నిజం పాలన గురించి పలుమార్లు మద్దతుగా మాట్లాడారు. వారి పాలనలో హైదరాబాద్ అభివృద్ధి చేసి విధానాన్ని పూసగుచ్చినట్లు వివరించారు.
  • కేసీఆర్ గత సంవత్సరం జాతీయ సమైక్యత దినోత్సవం గా భారతదేశానికి స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారత వజ్రోత్సవాల పేరుతో భాగంగా గత ఏడాదితో.. సెప్టెంబర్ 17 తో తెలంగాణకు స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ రెండిటిని కలగలిపి వచ్చేలా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఇందిరాపార్క్ లో జరిపారు.
  • ఈ ఏడాది కూడా తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవంగా వేడుకలు జరుపుకుంది.

BJP వాదన..

ఎలాగైనా బీజేపీ సర్కార్ తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్న సందర్భంగా Bjp కి ఇది ఒక సువర్ణ అవకాశం గా ఉపయోగించుకుంది. బీజేపీ దృష్టిలో విమోచన దినోత్సవం అంటే ఏడుగురు నిరంకుశ పాలన చేసిన నిజాం వంశస్థులు తెలంగాణ ప్రాంత హిందువులను బానిసలుగా చేసి చిత్రహింసలు చేసినా.. వారి నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ముస్లిం పాలన నుంచి హిందువులను విడిపించిన దినోత్సవం గా వీలు అంటున్న మాట.

ఇక్కడి తెలంగాణ ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ సర్కార్ ఈ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం గా జరపడం లేదు కాబట్టి ఆ అవకాశాన్ని బీజేపీ తీసుకుని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని ముందుకు వచ్చింది అలా జరుపుతుంది కూడా.. దీని వెనుక ఉన్న కారణం పూర్తిగా తెలంగాణలో ఉన్న ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా హిందూ ఓటు బ్యాంకు కోసం ఈ విమోచన దినోత్సవం నాటకం మొదలుపెట్టారు అని రాజకీయ విశ్లషకు అభిప్రాయం.

ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ దృష్టిలో విమోచనం అనగా ముస్లింల అణచివేత నుంచి హిందువులకు విముక్తి  ఇచ్చిన రోజు గా వీరి ముఖ్య వాదన.

కమ్యూనిస్టులు : సిపిఎం, సిపిఐ, హిందూ ముస్లిం సంఘాలు, ఆర్యసమాజ్ సంఘాల వాదనలు..

ఇదే తేదీ పై హిందువులు, ముస్లింల వర్గం, ఆర్యసమాజ్ సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం కాదు, విలీన దినోత్సవం కాదు, ఇది ఒక ముమ్మాటికీ విద్రోహ దినోత్సవం అని వీరి వాదన. వీరు రెండు వాదనల్లో సెప్టెంబర్ 17 తేదీపై స్పష్టమైన వివరణ ఇచ్చారు.

1.  నిజాం పాలనలో ఖాశిం రజ్వీ ఆధ్వర్యంలో వారు చేసిన దుర్మార్గపు చర్యలు అంత ఇంత కాదు. హిందువులను ముస్లింలను వెట్టి చాకిరి చేయించుకునేవారు, మహిళలపై సామూహిక అత్యాచారాలు జరిపారు. గ్రామాల్లో ఉన్న మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించారు, వ్యతిరేకంగా పోరాడిన వారిపై ఉక్కుపాదం వేసి వారిని బహిరంగంగాను అంతర్గతంగా చంపేసేవారు. ఇలా ఎందరో చనిపోతున్న ధైర్యం చేసి కొందరు నిజాం నిరంకుశ పాలనకు ఎదురు తిరిగిన కవులపై ఎన్నో దాడులు.. జర్నలిస్టులపై దాడులు ముస్లిం పోరాట యోధులు కూడా ఎన్నో దాడులు.. మారన హోమం జరిపిన ఘటనలు చెవి చూడాల్సి వచ్చింది తెలంగాణ.

2.  ఇదిలా ఉండగా సెప్టెంబర్ 16 1948 హైదరాబాద్ కి స్వతంత్రం వచ్చిన రెండు దినాల ముందు అప్పటి భారత హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఆపరేషన్ పోలో హైదరాబాద్ రాజధాని నలు మూలల చుట్టూ ముట్టి వచ్చిన భారత సైన్యం నిజాం పాలకులకు వ్యతిరేకంగా వస్తున్నామంటూ తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న కమ్యూనిస్టు పార్టీల.. పోరాటయోధులు బుల్లెట్ల వర్షం కురిపించింది. నిజానికి నిజాం నిరంకుశ పాలన పోరాటంలో చనిపోయిన వారి సంఖ్య కన్నా భారత సైన్యం చంపేసిన పోరాట యోధుల సంఖ్య ఎక్కువ. భారత సైన్యం తెలంగాణలో అడుగుపెట్టినప్పటి నుంచి సెప్టెంబర్ 17 రాత్రి 7 గంటల ముగిసే వరకు ఆపరేషన్ పోలో చర్య లో తెలంగాణ పోరాట యోధులు ఎందరో మృత్యువాత చెందారు.

ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం విద్రోహం, విమోచనం పొంది విలీనం దినోత్సవం. గా జరుపుకోవాలని సీనియర్, న్యాయవాదులు, జర్నలిస్ట్ లు, రాజకీయ విశేషాకులు. ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ లు.

S.SURESH