AP Politics : ఓవైపు పవన్‌, బాబు.. మరోవైపు షర్మిల.. అష్టదిగ్బంధనంలో పవన్‌!

అష్టదిగ్బంధనం అంటే తెలుసు కదా.. అన్ని వైపుల నుంచి ప్రమాదం ముంచెత్తిసినప్పుడు.. ఏమీ చేయలేని.. చేయడానికి ఏమీ లేని పరిస్థితుల్లో చేతులెత్తేసేంత ప్రమాదం. ఇప్పుడు జగన్‌ అలాంటి పరిస్థితుల్లోనే ఇరుక్కున్నారా అంటే.. అవును అనే చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో ! ఓ వైపు టీడీపీ, జనసేన (TDP-Janasena) పొత్తులు.. మరోవైపు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 28, 2024 | 01:40 PMLast Updated on: Jan 28, 2024 | 1:40 PM

On One Side Pawan And Babu On The Other Hand Sharmila Pawan In Ashtadigbandhanam

అష్టదిగ్బంధనం అంటే తెలుసు కదా.. అన్ని వైపుల నుంచి ప్రమాదం ముంచెత్తిసినప్పుడు.. ఏమీ చేయలేని.. చేయడానికి ఏమీ లేని పరిస్థితుల్లో చేతులెత్తేసేంత ప్రమాదం. ఇప్పుడు జగన్‌ అలాంటి పరిస్థితుల్లోనే ఇరుక్కున్నారా అంటే.. అవును అనే చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో ! ఓ వైపు టీడీపీ, జనసేన (TDP-Janasena) పొత్తులు.. మరోవైపు చెల్లి షర్మిల (Sharmila) దూస్తున్న కత్తులు.. ఇంకోవైపు సొంత పార్టీలో అసంతృప్తులు వేస్తున్న ఎత్తులు.. అన్నీ కలిసి.. ఒకేసారి మూకుమ్మడిగా వైసీపీని ముంచేసేందుకు సిద్ధంగా ఉన్నాయా అనిపిస్తోంది నిజానికి పరిస్థితి చూస్తుంటే ! తెలంగాణలో పార్టీ పెట్టి ఫెయిల్ అయిన షర్మిల.. ఏపీలో అడుగుపెట్టినా పెద్దగా నష్టం ఉండదని జగన్‌ భావించారు ముందు ! ఐతే తీరా సీన్ రివర్స్‌లా కనిపిస్తోంది.

జగన్‌ (CM Jagan) కేరక్టర్‌ మీద షర్మిల టార్గెట్‌ చేస్తోంది. వైఎస్‌ బిడ్డగా తన మీద షర్మిల చేసే ఇలాంటి కామెంట్లు జనాల్లోకి ఎలా వెళ్తాయనే టెన్షన్‌.. జగన్‌లో కనిపిస్తుందనే ప్రచారం జరుగుతోంది. పైగా జగన్‌ నుంచి వచ్చే ప్రతీ మాటకు షర్మిల కౌంటర్ ఇస్తున్నారు. ఇది వైసీపీని మరింత టెన్షన్‌ పెడుతోంది. చంద్రబాబు, పవన్‌ చేతులు కలిసి ముందుకు సాగుతున్న వేళ.. షర్మిల మాటలు, నిర్ణయాలు.. వైసీపీని మరింత భయపెడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఓ వైపు షర్మిల నుంచి ముప్పు కనిపిస్తుంటే.. మరోవైపు చంద్రబాబు, పవన్‌ రెచ్చిపోతున్నారు. వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ జనాల్లోకి వెళ్తున్నారు. జగన్ సర్కార్‌ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ నుంచి మూడు రాజధానుల వరకు.. ఇక అటు కోడికత్తి నుంచి వివేకా కేసు నుంచి ప్రతీ విషయాన్ని ఎన్నికల వేళ హైలైట్ చేస్తున్నారు.

జగన్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వ్యతిరేక ఓటు ఏ మాత్రం చీలొద్దు అన్నట్లుగా.. చంద్రబాబు, పవన్‌ కలవడం.. వీళ్లకు బీజేపీ తోడు అవుతుందనే ప్రచారం జరుగుతుండడం.. వైసీపీని కత్తిచంగా టెన్షన్ పెట్టే అంశమే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబు, పవన్‌, షర్మిల తీరు ఇలా ఉంటే.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పార్టీలో జరుగుతున్న పరిణామాలు.. జగన్‌ను మరింత టెన్షన్‌ పెడుతున్నట్లు కనిపిస్తున్నాయ్. నియోజకవర్గ ఇంచార్జిలను మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు జాబితాలు వచ్చేశాయ్‌ కూడా ! ఇందులో చాలామంది సిట్టింగ్‌లకు ఎదురుదెబ్బే తగిలింది.

ఐతే లిస్ట్‌లో చోటు దక్కని నేతలంతా.. వైసీపీ మీద తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కీలక నేతల్లో కొందరు ఇప్పటికే పార్టీని వీడగా.. మరికొందరు జంపింగ్‌ జపాంగ్‌ అనే పనిలో ఉన్నారు. ఈ పరిణామాలు.. జనాల్లోకి ఎలాంటి సందేశం తీసుకెళ్తుందనే టెన్షన్ ఉంది. ఇలా అటు ప్రత్యర్థి నుంచి.. ఇటు సొంత పార్టీ నుంచి ఒత్తిడి పెరుగుతున్న వేళ.. జగన్‌ ఒకరకంగా అష్టదిగ్బంధనం అయ్యారనే చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.