Minister Talasani : కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల ( Congress six guarantees)పేరుతో తప్పుడు ప్రచారం చేస్తుంది అని సనత్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani) ఫైర్ అయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు కే గ్యారెంటీ లేదు. అలాంటి రాష్ట్రానికి ఏం చేస్తుందని ఎద్దేవా చేశారు తలసాని.

On the Congress party Minister Talasani Srinivas Yadav who was fired
తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల ( Congress six guarantees)పేరుతో తప్పుడు ప్రచారం చేస్తుంది అని సనత్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani) ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్ నగర్ లోని సాయిబాబా, సుభాష్ నగర్, కైలాష్ నగర్, జై ప్రకాష్ నగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతు.. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు మంత్రి.
ఇది కూడా చదవండి : Tata Power Company : టాటా పవర్ కంపెనీలో చిరుత పులి కలకలం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
ఇక తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు కే గ్యారెంటీ లేదు. అలాంటి రాష్ట్రానికి ఏం చేస్తుందని ఎద్దేవా చేశారు తలసాని. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు మంత్రి. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి.. సంక్షేమం ప్రజలు తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మూడోసారి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.