రేప్ జరిగిన రోజు రాత్రి.. ASIకి కాల్ చేసి సంజయ్ ఏం చెప్పాడు..
రోజులు గడుస్తున్నాయ్ కానీ.. కోల్‌కతా డాక్టర్ హత్యాచారం మిస్టరీ వీడలేదు. సీబీఐ 11రోజులుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికీ వంద మందికి పైగా ప్రశ్నించింది. కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌తో పాటు ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తో సహా పలువురిపై పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు.
రోజులు గడుస్తున్నాయ్ కానీ.. కోల్‌కతా డాక్టర్ హత్యాచారం మిస్టరీ వీడలేదు. సీబీఐ 11రోజులుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికీ వంద మందికి పైగా ప్రశ్నించింది. కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌తో పాటు ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తో సహా పలువురిపై పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ఐతే ఇంకా కచ్చితంగాన ఆధారాలు మాత్రం కనిపెట్టలేకపోయారు. అసలు ఆరోజు ఏం జరిగిందో తెలియాలంటే.. ఇప్పుడు అధికారులకు కనిపిస్తున్న ఒకే ఒక్క ఆప్షన్.. ఏఎస్ఐ అరూప్ దత్తా. కోల్‌కతా డాక్టర్ కేసులో ఇతను ఇప్పుడు కీలకంగా మారాడు.
ఆయన నోరు తెరిస్తే.. చాలా ప్రశ్నలకు జవాబు దొరికే అవకాశం ఉంది. ఇప్పటికే సీబీఐ అధికారులు అరూప్‌ను విచారించారు. ఐతే చాలా ప్రశ్నలకు అనుమానాస్పద సమాధానాలు ఇచ్చాడు. దీంతో అతనిపై కూడా పాలిగ్రాఫ్ టెస్టులు చేసేందుకు సీబీఐ అధికారులు సిద్ధం అవుతున్నారు. అరూప్ దత్తా అనే వ్యక్తి కోల్‌కతా పోలీస్‌లో ఏఎస్‌ఐ. ట్రైనీ డాక్టర్‌ని హత్య చేసిన తర్వాత సంజయ్ రాయ్… అరూప్ దత్తా సొంత బ్యారక్‌లో నిద్రపోయాడు. నిందితుడు సంజయ్ సంఘటన జరిగిన రోజు రాత్రి ఏఎస్ఐ అరూప్ దత్తాకు కూడా ఫోన్ చేశాడు. ఐతే అరూప్‌తో సంజయ్ ఫోన్‌లో ఏం మాట్లాడాడు అని తెలిస్తే.. కేసుపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అసలు ఆరోజు రాత్రి సంజయ్ రాయ్ ఎందుకు కాల్ చేశాడు.. భయంతోనా.. సాయం కోసమా.. లేదంటే మరేదైనా విషయం చెప్పాడా.. అసలు హత్య గురించి అరూప్ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది.. ఈ ప్రశ్నలన్నింటికీ ఆనస్ర్ దొరికే చాన్స్ ఉంది. అసలు ఘటనకు సంబంధించి అరూప్ ఏదో దాస్తున్నాడని సీబీఐ అనుమానిస్తోంది. హత్య విషయం అతనికి తెలుసా.. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉంది అన్న విషయం అరూప్‌కు పక్కాగా తెలుసు అని సీబీఐ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. నిజానికి అరూప్‌కు.. ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్‌తో మంచి సంబంధాలు ఉన్నాయ్. వాళ్లు పార్టీ చేసుకున్న ఫొటోలు, పార్టీలో కలిసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్.
ఇప్పటికే సందీప్ పాత్ర మీద అనుమానాలు ఉండగా.. అరూప్‌కు అసలు విషయం తెలిసే అవకాశం కచ్చితంగా ఉందనే చర్చ జరుగుతోంది. ఇక అటు తెల్లవారు జామున 3 నుంచి 5 గంటల మధ్య హత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో బయటివాళ్లు ఆసుపత్రి వార్డులోకి వచ్చే అవకాశమే ఉండదు. ఐతే సంజయ్ రాయ్ మాత్రం.. 4గంటలకు ఆసుపత్రిలోకి ఎంటర్ అవుతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. అసలు ఆ టైమ్‌లో అక్కడికి రాయ్ ఎలా వచ్చాడు.. అరూప్ దగ్గరుండి పంపించాడా.. అదే నిజం అయితే ఎందుకు పంపించాడు.. ఎవరినైనా కేసు నుంచి తప్పించాలని అనుకున్నాడా.. అందుకే రాయ్‌ను ముందుకు తోశాడా.. ఇలాచాలా ప్రశ్నలకు అరూప్ నుంచి ఆన్సర్ రావాల్సి ఉంది. దీంతో సీబీఐ అధికారులు పాలిగ్రాఫ్ టెస్ట్‌కు రెడీ అవుతున్నారు.