Telangana Gun Park : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ.. గన్ పార్క్ చుట్టూ ఇనుప కంచె…
గన్ పార్క్ (Gun Park) చుట్టూ ఇనుప కంచెలు.. తెలంగాణ కోసం మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి కోసం తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్థూపం.. గన్ పార్క్ వద్ద శుక్రవారం ఇనుప కంచెలు మొలిచాయి.
గన్ పార్క్ (Gun Park) చుట్టూ ఇనుప కంచెలు.. తెలంగాణ కోసం మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి కోసం తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్థూపం.. గన్ పార్క్ వద్ద శుక్రవారం ఇనుప కంచెలు మొలిచాయి. తెలంగాణ లో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం గన్ పార్క్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. దీంతో అది కాస్త వివాదాస్పదం అవుతుంది. ఒకవైపు జూన్ 2న జరుగనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు అమరుల స్థూపాన్ని ముస్తాబు చేస్తూనే.. మరోవైపు ఎన్నడూ లేనివిధంగా గన్‌పార్క్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)..
రేపటితో తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు పూర్తి అవుతుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను (Telangana Emergence Festivals) ఘనంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఎప్పుడు చూడని విధంగా అమరవీరుల స్థూపానికి ఇనుప కంచెలు పెట్టడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కాగా దీనికి కారణం లేకపోలేదు కాంగ్రెస్ పార్టీ (Congress party) వర్గాల నుంచి వస్తున్న సమాధానం.. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం లో గన్ పార్క్ ఉన్న అమరవీరుల స్థూపాన్ని పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గన్ పార్క్ లో అల్లర్లు జరగకుండా కంచె ఏర్పాటు చేసినట్లు చెప్పుకొస్తున్నారు.