Punjab, Train Accident : ఘోర విషాదానికి ఏడాది.. ఇవాళ మరో రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ..

పంజాబ్‌ (Punjab) రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. పంజాబ్‌లో రెండు రైళ్లు ఢీ కొని ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఓ గూడ్సు రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 2, 2024 | 12:17 PMLast Updated on: Jun 02, 2024 | 12:17 PM

One Year Since The Tragedy Another Train Accident Today Two Trains Collided

 

 

పంజాబ్‌ (Punjab) రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. పంజాబ్‌లో రెండు రైళ్లు ఢీ కొని ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఓ గూడ్సు రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్ (Amritsar)-ఢిల్లీ రైల్వే లైన్‌(Delhi Railway Line) లోని ఫతేఘర్ సాహెబ్‌లో రెండు రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.. ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం.

కాగా సరిగ్గా.. ఇదే రోజు గత ఏడాది క్రితం.. ఒడిశా (Odisha) లో ఘోర రైలు ప్రమాదం జరిగి నేటితో ఏడాది పూర్తయ్యింది. 2023 జూన్ 2న రాత్రి కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. మరో ట్రాక్పై పడిన బోగీలను యశ్వంత్పూర్-హౌరా ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 275 మంది మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. కాగా ఇవాళ పంజాబ్లో గూడ్సు రైలు పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టడం గమనార్హం.