Balineni Srinivas: నేడు సీఎం జగన్ ను కలువనున్న బాలినేని శ్రీనివాస్.. ఏం చర్చించబోతున్నారు.?

బాలినేని శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ మాజీ అటవీ, విద్యుత్ శాఖ మంత్రి. ప్రస్తుతం ఈయనను అలకల శ్రీనివాస్ అని కూడా అంటున్నారు కొందరు. అందుకే నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని క్యాంప్ ఆఫీసులో కలిసేందుకు వెళ్తున్నారు. ఒంగోలులో జరిగే తాజా పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం.‎

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 19, 2023 | 11:10 AMLast Updated on: Oct 19, 2023 | 11:10 AM

Ongole Mla Balineni Srinivas Who Will Meet Cm Jagan Today

బాలినేని శ్రీనివాస్ కు వైసీపీ అధికారం వచ్చిన తొలినాళ్లలోనే కేబినెట్ లో చోటు కల్పించారు సీఎం వైఎస్ జగన్. అయితే రెండున్నర ఏళ్ల కాలం మాత్రమే పదవిని కేటాయించడంతో ప్రస్తుతం ఒంగోలులో సాధారణ ఎమ్మెల్యేగా కోనసాగుతున్నారు. మంత్రి పదవి కోల్పోయినప్పటి నుంచి తనకు వైసీపీలో ప్రధాన్యత తగ్గిపోతుందని తెగ ఫీలైపోతున్నారు. పార్టీలోనే కాదు, ప్రభుత్వ అధికారులు, పోలీసుల వద్ద తనకు తగిన గౌరవం లభించడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా పోలీసుల తీరును నిరసిస్తూ తనకు కేటాయించిన గన్ మెన్లను సరెండర్ చేశారు బాలినేని. ఆ తరువాత అధికారుల తీరుపై అనేక ఆరోపణలు చేశారు. వీటన్నింటిపై నేడు ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు బాలినేని ఇలాంటి పరిస్థితులకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

బాలినేని శ్రీనివాస్ పై గతంలో భూ ఆక్రమణలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా ఫేక్ డ్యాక్యూమెంట్ల విషయంలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు దోషులను గాలికొదిలేసి తనను ప్రశ్నించడం ఏందని మండిపడుతున్నారు. ఈ ఫేక్ డాక్యూమెంట్ స్కాములో వైసీపీ వాళ్లు ఉన్నా కేసులు పెట్టి లోపల వేయండి అని సూచించారు.
తన సూచనలపై పోలీసులు, జిల్లా కలెక్టర్ పట్టించుకోవపోవడంతో తన మాటకు గౌరవం లేదని అసహనం వ్యక్తం చేశారు. దీని కారణంగా తన గన్ మెన్లను కూడా వద్దని ఎస్పీకి లేకరాస్తూ సరెండర్ చేశారు. ఇలా గతంలో చాలా విషయాల్లో బాలినేని అసహనం వ్యక్తం చేయడం, అధిష్టానం మందలించడం లేదా నచ్చజెప్పడంతో పరిస్థితి సర్థుమణిగేది. మరోసారి బాలినేని చేసిన చర్యలపై చర్చించేందుకే సీఎం జగన్ ను కలువనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో కలవడానికి కారణాలు ఇవే..

  • ఒంగోలులో వైవీ సుబ్బారెడ్డి, బాలినేనికి మధ్య ఆధిపత్యపోరు తారా స్థాయిలో ఉంటుంది. ఎప్పటి నుంచో సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలుస్తున్నారు. వీరిద్దరినీ కొంచం దూరంపెట్టేందుకే అధిష్టానం బాలినేనికి ఎమ్మెల్యే చేసి మంత్రి పదవి ఇచ్చింది. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మెన్ గా నాలుగేళ్లు పదవిలో కొనసాగేలా చేసింది. దీంతో ఇక్కడ పరిస్థితులు కొంత వరకూ శాంతించింది. అయితే మంత్రిగా ఉన్నంత వరకూ ఎలాంటి ఇబ్బందులు రాలేదు.

 

  • కేబినెట్ ర్యాంకులో ఆదిమూలపు సురేష్ ను మంత్రిగా కొనసాగించి తనను తప్పించడంతో మళ్లీ బాలినేనికి పవర్స్ తగ్గాయన్న అభిప్రాయం ఏర్పడింది. దీనిని గమనించిన జగన్ అప్పట్లో పిలిపించి బుజ్జగించి పంపించారు. ఆ తరువాత సుబ్బారావు గుప్తా ల్యాండ్ కబ్జాల విషయం వెలుగులోకి వచ్చింది. దీని వెనుక బాలినేని ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై స్పందించిన బాలినేని.. వైసీపీ నేతలు కావలని పనికట్టుకు ఇలా చేస్తున్నారని అన్నారు. వాటిని లైట్ తీసుకుంది అధిష్టానం. దీనిపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. వీటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. టీ కప్పులో తుఫాను కాదు. అసలు కప్పులో టీ యే లేదు అని తొసిపుచ్చారు.

 

  • తన బంధువు భాస్కర్ రెడ్డికి వైజాగ్ ఫారెస్ట్ భూములు, ఒంగోలులోని వెంగముక్కపాలెం భూముల కట్టబెట్టడంలో బాలినేని పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. అటవీ శాఖ మంత్రిగా కొనసాగిన సమయంలో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన అంశంపై అధిష్టానం సీరియస్ అయింది. బాలినేనిని పిలిపించి మందలించినట్లు ఒక వర్గంవారు గుసగుసలాడుకున్నారు. దీనిపై బాలినేని కన్నీటి పర్యంతమయ్యారు.

 

  • గతంలో సీఎం జగన్ మార్కాపురంలో పర్యటించారు. అక్కడ ప్రోటోకాల్ పేరుతో ఈయనను దూరం పెట్టారు పోలీసులు. దీనిపై మరోసారి అలిగిన బాలినేని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా వచ్చిన భూఅక్రమాలపై సిట్ అధికారుల తీరుపై గుర్రున ఉన్నారు. అసలు దోషులను పక్కన పెట్టి తనను టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే తనక విలువ ఇవ్వని పోలీసులు అవసరం లేదని గన్ మెన్లను సరెండర్ చేశారు.

ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో మరోసారి బాలినేని పిలింపించి మాట్లాడే సంప్రదాయానికి తెర తీసింది. బాలినేని శ్రీనివాస్ జగన్ కి దగ్గరి బంధువు కావడంతో ఈ భూ అక్రమాల ఆరోపణలతోపాటూ తాజాగా బాలినేని చేసిన చర్యలపై జగన్ ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి.

T.V.SRIKAR