Onion Prices : కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధర .. తగ్గేదే లేదంటూ 70 చేరిన ఉల్లి
మొన్న టమాటా.. నేడు ఉల్లి.. ప్రజల చేత కంగుతినిపిస్తుంది. నెల రోజులుగా ఉల్లి ధర రూ.60 నుంచి 70 పై మాటే. ఉల్లిపాయ రేటు తగ్గుతుందని మధ్యతరగతి ప్రజలు ఎదురు చూస్తున్న.. ధరలు మాత్రం పక్క మోట్టూ కూడా దిగడంలేదు. అంతకంతకు పెరుగుతునే పోతుంది. నిజానికి మార్కెట్ లోకి కొత్త పంట వస్తుండడంతో రేటు తగ్గుతుందని భావించినా పరిస్తితి మారలేదు. దీనికి కారణం ధలరీలు, కమీషన్ ఏజెంట్ల, వ్యాపారుల మాయాజాలం కూడా కారణమని ఆరోపణలు విన్పిస్తున్నాయి.

Onion that brings tears.. The price of onion has reached 70 as if it will not decrease
మొన్న టమాటా.. నేడు ఉల్లి.. ప్రజల చేత కంగుతినిపిస్తుంది. నెల రోజులుగా ఉల్లి ధర రూ.60 నుంచి 70 పై మాటే. ఉల్లిపాయ రేటు తగ్గుతుందని మధ్యతరగతి ప్రజలు ఎదురు చూస్తున్న.. ధరలు మాత్రం పక్క మోట్టూ కూడా దిగడంలేదు. అంతకంతకు పెరుగుతునే పోతుంది. నిజానికి మార్కెట్ లోకి కొత్త పంట వస్తుండడంతో రేటు తగ్గుతుందని భావించినా పరిస్తితి మారలేదు. దీనికి కారణం ధలరీలు, కమీషన్ ఏజెంట్ల, వ్యాపారుల మాయాజాలం కూడా కారణమని ఆరోపణలు విన్పిస్తున్నాయి.
Bigg Boss 7 : రతిక , ప్రశాంత్ మధ్య డైలాగ్ వార్.. అన్నా పంచె జాగ్రత్త
మలక్ పేట్ మార్కెట్ కు తెలంగాణ నుంచే కాకుండా.. దేశంలోని చాలా రాష్ట్రలైనా.. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, నుంచి భారీగా ఉల్లి తెలంగాణకు దిగుమతి అవుతుంది ఎరిగింది కూడా. ప్రతి రోజుకు 70-80 లారీల ఉల్లి దిగుమతి అవుతోంది. గతేడాది నవంబర్ తో పోలిస్తే ఈ ఏడాది లారీ సంఖ్య ఎక్కువగా ఉందని మలక్ పేట్ మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం ఉల్లి దిగుమతి పెరిగినా.. రాష్ట్రంలో ధరలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు అని వ్యాపారులు అంటున్నారు.
గతేడాది ఇదే నెల నవంబర్‌లో కిలో ఉల్లిగడ్డ ధర రూ.30 ఉండగా.. ఈ ఏడాది రూ.60 పైనే పలుకుతోంది. వారం రోజులుగా మహారాష్ట్ర నుంచి భారీగా ఉల్లి సరఫరా పెరిగింది. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కలిసి సిండికేట్‌గా మారి ఉల్లి ధరలు తగ్గించడం లేదని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. కాగా హైదరాబాద్ సహా జంట నగరాల్లోని మార్కెట్‌లలో ఉల్లిగడ్డ నిల్వచేయడానికి తగిన గోదాముల వసతి లేక పోవడంవల్లే ఈ పరిస్థితి వస్తోందని వారంటున్నారు.
200 crores to defeat Sitakka : సీతక్కను ఓడించేందుకు 200 కోట్లు..
ఢిల్లీలో ఉల్లి రూ.70కి చేరింది..
దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లిగడ్డ ధరలు 25-50 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ.50-70 వరకు విక్రయిస్తున్నారు. సోమావారం ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోని కొన్ని మార్కెట్లలో నాణ్యమైన ఉల్లి అత్యధికంగా కిలో రూ.50కి చేరింది. అహ్మద్ నగర్‌లో 10 రోజుల్లో సగటు ఉల్లి ధరలు కిలో రూ.35 నుంచి రూ.50కు పెరిగాయి.