Summer schools : రాష్ట్రంలో ఒంటిపుట బడులు ప్రారంభం.. ఈనెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు నిర్వహణ..
తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఒంటిపుట బడులపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా క్రమంగా ఎండలు పెరుగుతుపోతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఒంటిపుట బడులపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా క్రమంగా ఎండలు పెరుగుతుపోతున్నాయి. భారీ ఎండలు దృష్టిలో పెట్టుకోని తెలంగాణ ప్రభుత్వం, విద్యాశాక మంత్రి(Education Minister).. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఒంటిపుట బడులపై (Summer schools) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వం, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు ఒంటిపుట బడులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బడులు ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12 : 30 గంటల వరకు కొనసాగుతాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మధ్యాహ్నం 12 : 30 గంటల సమయంలో అందజేస్తారు. పదో తరగతి పరీక్షల సమయంలో పరీక్షాకేంద్రాలున్న బడుల్లో మాత్రం మధ్యాహ్నం పూట స్కూళ్లను నిర్వహిస్తారు. వీరికి తొలుత మధ్యాహ్నం భోజనం అందజేసి ఆ తర్వాత తరగతులు కొనసాగిస్తారు. పది పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా బడులు నడుస్తాయి.