Ooru Peru Bhairavakona Review : సందీప్ కిషన్ మళ్లీ మిస్ అయ్యాడు..
సందీప్ కిషన్ (Sandeep Kishan), వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ నటించిన ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సందీప్ కిషన్ (Sandeep Kishan), వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ నటించిన ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విఐ ఆనంద్ (VI Anand) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఫాంటసీ, అతీంద్రీయ శక్తల నేపథ్యంలో సాగుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. సందీప్ కిషన్ హిట్ కొట్టాడా.. లేదా రివ్యూలో తెలుసుకుందాం.
స్టోరీ లైన్…
బసవలింగం అయిన సందీప్ కిషన్ స్టంట్ మాస్టర్‌గా పనిచేస్తుంటాడు. అతను ఓసారి ఆటోలో వెళ్తుంటే.. భూమి అయిన వర్ష బొల్లమ్మ కనిపిస్తుంది. చూడగానే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. భూమి హ్యాండ్ బ్యాగ్‌ను ఇద్దరు దొంగలు తీసుకువెళ్లిపోతారు. వాళ్లను పట్టుకుని ఆ బ్యాగ్‌ను బసవ తీసుకుని.. అందులో ఉండే అస్థిపంజరం చూసి షాక్ అవుతాడు. భూమి కోసం బసవ ఒక ఇంటికి వెళ్లి పెళ్లికూతురు నగలు ఎత్తుకుపోతాడు. అతని స్నేహితుడు జాన్ అయిన హర్ష తో ఆ నగలు పట్టుకుని పోలీసులకు దొరక్కుండా పారిపోతుంటారు. దారిలో గీత అయిన కావ్య థాపర్ కనిపిస్తుంది. ఇలా వెళ్తుండగా.. వీళ్లు భైరవకోన అనే గ్రామంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రామంలో వీళ్లకి అన్ని వింతగా కనిపిస్తాయి. మనుషులు కూడా వింతగానే ఉంటారు. అసలు ఆ గ్రామంలో ఎందుకు అందరూ వింతగా ఉన్నారు. భైరవకోనకి బయట ప్రపంచానికి ఎటువంటి సంబంధం ఉంది ఆ గ్రామంలోనికి వెళ్లిన వాళ్లు తిరిగి బయటకి రాగలరా అక్కడికి వెళ్లిన వీళ్లు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు భూమి ఎవరి అస్థిపంజరం అవయావాలు అలా బ్యాగ్‌లో పెట్టుకుని తిరుగుతుంది.. ఆమె కథ ఏంటి.. అన్నది తెలియాలంటే థియేటర్‌లో సినిమా చూడాల్సిందే.
పర్పామెన్స్ విషయానికి వస్తే… సందీప్ కిషన్ బెస్ట్ ఫర్మామెన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతి సినిమాలో అతని కష్టం ఎలా కనబడుతుందో.. ఈ సినిమాలో కూడా అంతే. భూమి పాత్రలో వర్ష అదరగొట్టేసింది. కావ్య థాపర్‌కి కూడా ఈ సినిమాలో కావలసినంత స్క్రీన్ స్పేస్ దొరికింది. వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. మిగతా నటీనటులు వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ విషయానికొస్తే …ఈ సినిమా ఫాంటసీ, అతీంద్రీయ శక్తుల నేపథ్యంలో సాగుతుంది. అయితే ఈ చిత్రంలో కథ ఎటు నుంచి ఎటు వెళ్తుందో, ఏం జరుగుతుందో అర్థం కాదు. దర్శకుడు చెప్పదలుచుకున్న పాయంట్ సరిగ్గా చెప్పలేకపోయాడనిపిస్తుంది. ఫస్టాప్ ఒకే అనిపించినా.. సెకండాఫ్ అంతగా ఆకట్టుకోదు. అన్నింటికి మించి క్లైమాక్స్ ఆకట్టుకోదు. కథలో ట్విస్ట్‌లు ఉన్నప్పటికీ అవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవు. సినిమాలో పాటలు బాగున్నాయి. బీజీఎం కూడా ఆకట్టుకుంటుంది. కెమెరా వర్క్ పర్లేదు అనిపించింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా ఒకే అన్నట్లుగానే ఉన్నాయి.