Israel-Palestine War, Operation Ajay : యుద్ధ భూమిలో భారతీయులు.. విజయవంతంగా “ఆపరేషన్ అజయ్”

ఇజ్రాయెల్, పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ కి మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.. దీంతో ఇరు దేశాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొన్నాయి. ఈ క్రమంలో అక్కడున్న భారతీయుల ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. వీరిని సురక్షితంగా ఇండియా ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు మోదీ సర్కార్ సిద్దమయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 13, 2023 | 12:21 PMLast Updated on: Oct 13, 2023 | 12:29 PM

Operation Ajay Was Successfully Included In The Evacuation Program Of Indians Caught In The Ongoing War Between Israel And Palestine

ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం ఎవరు అపలేని స్థితిలో వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం ఎవరు ఆపలేని స్థితిలో వెళ్ళిపోయింది. ఇలా ఇజ్రాయెల్ – పాలస్తీనా లో కూడా భారతీయులు చిక్కుకుపోయారు.  భారతీయులను తిరిగి మన దేశం వచ్చేందుకు వీలుగా ఆపరేషన్ అజయ్ ను ప్రారంభించారు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్. పాలస్తీనాలో కంటే ఇజ్రాయెల్ లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రి గుర్తించారు. అందులో ఉన్నత చదువులు, ఉపాధి కోసం ఈ దేశాలకు వెళ్ళిన భారతీయులు.. ఎక్కువ శాతం.. విద్యార్థులు, ఐటీ నిపుణులు, టూరిజం కోసం వెళ్లిన వారు అక్కడ ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. అక్కడ చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా మన దేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలను చేపట్టింది. మన ప్రజల కోసం ‘ఆపరేషన్ అజయ్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

యుద్ధ భూమిలో 18 వేల మంది భారతీయులు.. 

ఇదిలావుంటే ఇజ్రాయెల్‌లో సుమారు 18 వేల మంది వరకు భారతీయులు ఉన్నట్లు అధిరిక లెక్కలు చెబుతున్నాయి. వీరందరినీ సురక్షితంగా భారత్ కు తరలించే ఏర్పాట్లు చేసామని.. ఆ దేశంలోని భారత దౌత్య కార్యాలయం వద్దకు వెళ్లి తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో అక్కడి నుంచి భారతీయులను ఇండియాకు ‘ఆపరేషన్ అజయ్’ కింద తీసుకువస్తామని విదేశాంగ శాఖ తెలిపారు. భారతీయులందరూ ఇండియన్ ఎంబసీ, అలాగే ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరింది. ఏదైనా సమస్య వస్తే రాయబార కార్యాలయం అత్యవసర నంబర్లను సంప్రదించాలని సూచించారు.

విజయవంతంగా “ఆపరేషన్ అజయ్”

ఇజ్రాయెల్, పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ కి మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.. దీంతో ఇరు దేశాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొన్నాయి. ఈ క్రమంలో అక్కడున్న భారతీయుల ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. వీరిని సురక్షితంగా ఇండియా ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు మోదీ సర్కార్ సిద్దమయ్యింది. ఇలా  ‘ఆపరేషన్ అజయ్’  పేరిట ముందుగా ఇజ్రాయెల్ లోని భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ విజయవంతంగా మొదలై భారతీయులు ఇండియాకి చేరుకున్నారు.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇజ్రాయెల్ నుండి వచ్చిన ప్రయాణికులకు స్వాగతం పలికారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి క్షేమంగా స్వస్థలాలకు వెళ్లాలని సూచించారు. ఇలా స్వదేశానికి చేరుకున్న వారితో విమానాశ్రయంలో ఫోటో దిగారు కేంద్ర మంత్రి చంద్రశేఖర్. గతంలో ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా భారతీయులను రప్పించేందుకు భారత ప్రభుత్వం  “ఆపరేషన్ గంగ” ను చేపట్టిన సంగతి తెలిసిందే.

భారత్ మాతా కి జై హోరెత్తిన నినాదాలు.. 

ఇజ్రాయెల్ నుండి స్వదేశానికి వచ్చిన వారి భావోద్వేగం.. భారత్ మాతా కి జై నినాదాలు హోరెత్తాయి. ఇజ్రాయెల్ నుండి బయలుదేరిన భారతీయులు విమానంలో భారత్ మాతా కీ జై, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు. తమను సురక్షితంగా కాపాడిన కేంద్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

మోదీతో మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని..

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడారు. హమాస్ మిలిటెంట్లు జరుగుతున్న యుద్ధం గురించి బెంజమిన్ నెతన్యాహు.. మోదీకి వివరించారు. ఈ సందర్భంగా హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలను భారత దేశం ఖండిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఈ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ కు మద్దతు ఉంటుందని భారత్ ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ లోని భారతీయ పౌరుల భద్రతను, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రస్తావించారు.

S.SURESH