REVANTH REDDY: రేవంత్ టార్గెట్‌గా ఫోన్ ట్యాపింగ్.. ఆదేశాలిచ్చిన ఆ BRS లీడర్ ఎవరు..?

ఎన్నికల ముందు రేవంత్ సోదరులు, అనుచరులతో పాటు కొందరు పొలిటికల్ లీడర్లు, వ్యాపారులు, మీడియా అధినేతల ఫోన్లు కూడా టాప్ చేశాడు ప్రణీత్ రావు. BRS ముఖ్యనేత ఇచ్చిన ఆదేశాలతోనే ఈ టాపింగ్‌కు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 15, 2024 | 01:14 PMLast Updated on: Mar 15, 2024 | 1:52 PM

Operation Revanth Reddy Phone Tapping On Revanth Confirmed By Praneeth Rao

REVANTH REDDY: గత బీఆర్ఎస్ సర్కార్‌‌లో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి టార్గెట్‌గా SIB ట్యాపింగ్ ఆపరేషన్ నడిచింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ DSP ప్రణీత్ రావు అరెస్ట్‌తో కథ మొత్తం బయటకొస్తోంది. ఎన్నికల ముందు రేవంత్ సోదరులు, అనుచరులతో పాటు కొందరు పొలిటికల్ లీడర్లు, వ్యాపారులు, మీడియా అధినేతల ఫోన్లు కూడా టాప్ చేశాడు ప్రణీత్ రావు. BRS ముఖ్యనేత ఇచ్చిన ఆదేశాలతోనే ఈ టాపింగ్‌కు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు.

ELECTORAL BONDS: అంతా సీక్రెట్.. 1000 కోట్లు ఇచ్చిన కాళేశ్వరం కాంట్రాక్టర్

ఆ BRS నేత రాత్రికి రాత్రి 100 ఫోన్ నెంబర్లు ఇచ్చి వీటన్నింటినీ ట్యాపింగ్ చేయాలని ఆదేశించినట్టు తేలింది. అప్పటి ప్రతిపక్షనేత రేవంత్ రెడ్డిని ఎవరు.. ఎప్పుడు కలుస్తున్నారనే దానిపై దృష్టి పెట్టారు BRSలో పెద్ద నేత. ఆ సమాచారం సేకరించి.. ఎప్పటికప్పుడు ఆ బీఆర్ఎస్ నేతకు అందించారు ప్రణీత్ రావు. డబ్బుల సమాచారాన్ని కూడా చేరవేశాడు. రేవంత్ అనుచరులతోపాటు చుట్టుపక్కల ఉన్న వారి ఫోన్లను కూడా ప్రణీత్ రావు ట్యాప్ చేశాడు. ఆయన ఫోన్లో వాట్సాప్ చాటింగ్స్‌ని రిట్రీవ్ చేశారు పంజాగుట్ట పోలీసులు. ఆ చాటింగ్ ఆధారంగా పోలీసుల విచారణ కొనసాగుతోంది. గత ఏడాది ఎన్నికలకు ముందు అక్టోబర్ 17, 18 తేదీల్లో రేవంత్ రెడ్డితో పాటు శ్రీనివాస్, ఎమ్మార్‌ని కలవడానికి ఆది కేశవులు కొడుకు శ్రీనివాస్ నాయుడు వస్తున్నాడనీ.. సాయంత్రం కీలక సమావేశం ఉందని ప్రణీత్ చేరవేశాడు. పెద్దపల్లి, ములుగులో జోత్స్నరెడ్డి, శివారెడ్డి డబ్బులు పంచుతున్నారంటూ.. అక్టోబర్ 15న తెలిపాడు. మీడియాలో పనిచేసే మధుసూధన్ రెడ్డి.. రేవంత్‌కు 3 కోట్లు ఎరేంజ్ చేశారని ప్రణీత్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.

Pithapuram Issue: అసమ్మతి సెగ.. పవన్‌కు పిఠాపురం సీటు.. రచ్చ.. రచ్చ..

మరో కీలక వ్యక్తి 80 కోట్లు ఇచ్చేందుకు రెడీ ఉన్నారని ఫోన్ నెంబర్‌తో సహా బయటపెట్టాడు. రేవంత్ రెడ్డి దగ్గర పనిచేసే నగేష్‌ని కూడా ఫాలో కావాలని.. ప్రణీత్‌కు బీఆర్ఎస్ లీడర్ ఆదేశాలిచ్చారు. ఆళ్ళపాటి విజయ్ కుమార్ ఖమ్మంకి డబ్బులు తీసుకొని వెళ్తున్నాడని ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు. ఆయనకు శ్రీధర్, రాజేందర్, అశోక్ సాయం చేస్తున్నట్టు ఫోన్ నెంబర్స్‌తో సహా అధికారులకు చేరవేశాడు ప్రణీత్ రావు. కర్నాటక నుంచి అంబులెన్స్‌లో డబ్బులు వస్తున్నాయని మాట్లాడుకున్నారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు బయటపెట్టారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల టీమ్ ఈ కేసును విచారిస్తోంది. ప్రణీత్ రావు నుంచి 3 సెల్ ఫోన్లతో పాటు ఒక లాప్ టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ డీఎస్పీ 3 రకాల నేరానికి పాల్పడినట్టు కేసులు నమోదు చేశారు. సాక్షాలు చెరిపివేత, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ టాంపరింగ్ లాంటి నేరాలకు పాల్పడ్డాడు ప్రణీత్ రావు. SIB ఆఫీసులో 17 సిస్టమ్స్ ద్వారా ప్రణీత్ రావు ట్యాపింగ్ చేశాడు. అందుకోసం స్పెషల్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను కూడా కేటాయించారు.

రహస్యంగా ప్రముఖుల రికార్డింగ్స్‌ను మానిటర్ చేసి.. వాటిని వాట్సాప్ ఛాట్ ద్వారా ఉన్నతాధికారులు, బీఆర్ఎస్ ముఖ్యనేతకు అందించేవాడు. ఇలా సేవ్ చేసిన రికార్డ్స్‌ని అక్రమంగా పర్సనల్ పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసుకునేవాడు ప్రణీత్ రావు. తన అక్రమాలు బయటపడకుండా పాత హార్డ్ డిస్క్‌లను కట్టర్లతో డిస్మాంటిల్ చేశాడు. డిసెంబర్ 4న రాత్రి పాత హార్డ్ డిస్క్‌లో డేటా మొత్తాన్ని ధ్వంసం చేశాడు. పాత హార్డ్ డిస్కుల స్థానంలో కొత్తవి అమర్చినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. అయితే ఫోన్లు ట్యాప్ చేయాలని తనకు ఆదేశాలిచ్చిన ఆ బీఆర్ఎస్ ముఖ్యనేత ఎవరో కూడా ప్రణీత్ రావు పోలీసుల ముందు బయటపెట్టినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన స్టేట్మంట్‌తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్‌ను కూడా పోలీసులు సేకరించినట్టు సమాచారం.