Indians: అగ్రరాజ్యాలను ఏలుతున్న భారతీయులు వీళ్లే..

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసించే మనోళ్ళ సంఖ్య దాదాపు 3.2 కోట్లుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా లెక్కలు వెల్లడించింది. అందులో చాలా మంది రాజ్యాధికారంలో కూడా ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 3, 2023 | 11:27 AMLast Updated on: Sep 03, 2023 | 11:27 AM

Our Indians Are Ruling In Many Countries Of The World

దేశమును ప్రేమించు మన్న.. మంచి అన్నది పెంచుమన్న అని గురజాడ రాచించారు.ఈ వాక్యాన్ని నిజం చేస్తున్నారు కొందరు పొరుగు దేశం ప్రధానులు. వీరందరూ మన దేశం నుంచి వలస వెళ్లిన వారే కావడం విశేషం. భారతదేశానికి చెందిన మూలాలు మరో దేశంలో ఉండటం.. అందులోనూ రాజ్యాధికారాన్ని అధిరోహించడం నిజంగా మెచ్చుకోదగ్గ అంశం. వీరందరూ మన దేశాన్ని ప్రేమించిన వాళ్లే.. ఇతర దేశాల మంచి కోరుతున్న వారు.మన దేశం అన్నింటా ముందుకు దూసుకుపోతుంది. సాంకేతిక, ఆర్థిక, సామాజిక పరంగానే కాకుండా రాజకీయంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. అందులో కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సింగపూర్..

థర్మన్ షణ్ముగరత్నం ఇతను తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తూ ఉండేవారు. తాజాగా సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అది కూడా 70శాతం ఓట్లతో ఈ విజయాన్ని సాధించడం చెప్పుకోదగ్గ అంశం. ఇతని వయసు 66 సంవత్సరాలైనప్పటికీ ఆదేశ ప్రజలు ఇతనిని ఎన్నుకోవడం గొప్ప విషయంగా చెప్పాలి. అలాగే మరో కీలక నేత కూడా ఉన్నారు. ఇతను 2020 నుంచి సింగపూర్ ప్రతి పక్ష నేతగా కొనసాగుతూ కవితలు, కథలు రచిస్తున్నారు.

అమెరికా..

అమెరికా మనకంటే వందరెట్టు అభివృద్ది చెందిన దేశం. ఈ దేశాన్ని ఏలేటందుకు నడుంబిగించారు తమిళనాడుకు చెందిన కమలా హారిస్. ఈమె ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇదే కోవలో చేరేందుకు మరొకరు ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా ఆ దేశ అధ్యక్ష పదవిపైనే కన్నేసి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోదిగేందుకు పోటీ పడుతున్నారు. ఇతని పేరు వివేక్ స్వామి. ఇతని తల్లిదండ్రులు కేరళ నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడినట్లు తెలుస్తోంది. వీరందరితోపాటూ నికీ హేలీ కూడా భారత సంతతికి చెందిన నేతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక అమెరికా పార్లమెంట్ విషయానికొస్తే రాజా కృష్ణమూర్తి, తానేదార్, అమీ బెరా, రోఖన్నా, ప్రమీలా జయపాల్ తదితరులు ఉన్నారు.

బ్రిటన్..

ఈ దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. వీళ్ళు గతంలో ప్రపంచం మొత్తం పరిపాలించారు. అందులో మన ఇండియాలో అయితే స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అనేక వ్యాపార లావాదేవీలు జరుపుకున్నారు. అలాంటి బ్రిటీష్ రాజ్యంలో నేడు మన తెలుగోడు జండా నాటడం అంటే సాధారణమైన విషయం కాదు. అతనే రుషి సునక్. ఇతను ఆదేశ ప్రధాన మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన బ్రిటన్ రాజ్యాధికారాన్ని సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. 210 ఏళ్ల చరిత్ర ఉన్న ఇంగ్లాండ్ సింహాసనంపై అతి చిన్న వయస్కుడు అధిరోహించడం కొత్త చరిత్రను సృష్టించినట్లయింది. ఇతని క్యాబినెట్ లో కూడా అనేక మంది భారత సంతతికి చెందిన వారు మంత్రులు గా కొసాగుతున్నారు. బ్రవర్మన్, క్లైరీ కౌటిన్హోలు గోవాకు చెందిన వారు.

ఇర్లాండ్..

ప్రస్తుతం ఐర్లాండ్ ప్రధానిగా ఉన్న లియో ఎరిక్ వరాద్కర్ తండ్రి ముంబాయికి చెందిన వారు. ఇతను తన డాక్టర్ పనితో జీవనప్రమాణాలను మెరుగ్గా మార్చుకోవడం కోసం యునైటెడ్ కింగ్ డమ్ కి వచ్చారు.

పోర్చుగల్..

ఈ దేశ ప్రధానిగా ఉన్న ఆంటోనియా కోస్టా 2015 నుంచి ఆ దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇతనికి భారతదేశంతో పాటూ పోర్చుగీసు మూలాలు కూడా ఉన్నాయి.

వెస్ట్ ఇండీస్..

ఎలెక్ట్ క్రిస్టిన్ కార్లా కంగాలూ అనే వ్యక్తి కరేబియన్ దీవుల్లో ఉండే ట్రినిడాడ్ టొబాగో కి అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. వీళ్లు ఇండో-ట్రినిడాడ్ కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చినట్లు తెలుస్తోంది.

మారషస్ దీవుల్లో..

ప్రవింద్ జగన్నాథ్ ఇతను హిందూ యదువంశ కుటుంబానికి చెందిన వ్యక్తి. 2017 నుంచి మారషస్ ప్రధానిగా కొనసాగుతున్నారు. వీరి పూర్వీకులు తాత, ముత్తాతలు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా తెలుస్తోంది. 1870 ఆ ప్రాంతంలో ఇలా వలసవెళ్ళినట్లు తెలుస్తోంది.

సురినామ్, గయానా, సీషెల్స్ దేశాల అధ్యక్షులు భారతీయ సంతతికి చెందిన వారు కాగా కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో మరికొందరు మంత్రులు, ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు.

ఇలా భారత మూలాలు ఉన్న వారు ఏఏ దేశాల్లో రాజ్యాధికారాన్ని అధిరోహిస్తున్నారు అన్న దానికపై 2021లో ఒక జాబితా విడుదలయ్యింది. అందులో ప్రపంచవ్యాప్తంగా 15 పైగా దేశాల్లో మనోళ్ళే జండా పాతినట్లు తెలిసింది. 60 మందికి పైగా మంత్రులుగా కొనసాగుతుండగా మరో 200 పైగా భారతీయులు కీలకమైన స్థానాల్లో కొనసాగుతున్నారు.

T.V.SRIKAR