Owaisi Brothers : ఓవైసీ బ్రదర్స్ కి సూపర్ చెక్ కాంగ్రెస్ ప్లాన్ అదిరింది !

ఇప్పటి దాకా దేశవ్యాప్తంగా ముస్లింలకు తామే వారసులమని చెప్పుకుంటున్న ఓవైసీ బ్రదర్స్ కు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ సూపర్ ప్లాన్ వేసింది. హైదరాబాద్ పాతబస్తీలో మజ్లిస్ పార్టీకి MBT తో చెక్ పెట్టాలని నిర్ణయించింది. పాత బస్తీలో ఒవైసీలకు చెందిన మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ పార్టీకి.. మజ్లిస్ బచావో తెహ్రీక్ కి పచ్చగడ్డ వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. పాత బస్తీలో ఎంబీటీ ఒక్క సీటు గెలుచుకోకపోయినా.. ప్రతి ఎన్నికల్లోనూ ఎంతో కొంత పుంజుకుంటోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 14, 2024 | 12:24 PMLast Updated on: Jan 14, 2024 | 12:24 PM

Owaisi Brothers Have A Super Check Congress Plan

ఇప్పటి దాకా దేశవ్యాప్తంగా ముస్లింలకు (Muslim) తామే వారసులమని చెప్పుకుంటున్న ఓవైసీ బ్రదర్స్ (Owaisi Brothers) కు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ సూపర్ ప్లాన్ వేసింది (Congress Super Plan). హైదరాబాద్ పాతబస్తీలో మజ్లిస్ పార్టీకి (Majlis Party) MBT తో చెక్ పెట్టాలని నిర్ణయించింది. పాత బస్తీలో ఒవైసీలకు చెందిన మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ పార్టీకి.. మజ్లిస్ బచావో తెహ్రీక్ కి పచ్చగడ్డ వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. పాత బస్తీలో ఎంబీటీ ఒక్క సీటు గెలుచుకోకపోయినా.. ప్రతి ఎన్నికల్లోనూ ఎంతో కొంత పుంజుకుంటోంది. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీలో గెలిచిన MIM ఎమ్మెల్యేలందరికీ గతం కంటే ఓట్ల శాతం తగ్గింది. అందుకు కారణం.. జనం కాంగ్రెస్ వైపు టర్న్ అవడం.. కొందరు ఎంబీటీకి ఓట్లు వేయడం. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని యాకుత్ పురా అసెంబ్లీ సీటులో MIMకు ఎంబీటీ గట్టి పోటి ఇచ్చింది. ఆ తర్వాత నాంపల్లిలో మజ్లిస్ కు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింలు కాంగ్రెస్ కు ఓట్లేశారు. ఈ పరిస్థితుల్లో ముస్లిం ఓటు బ్యాంకుపై గురి పెట్టింది కాంగ్రెస్.

వైఎస్సార్ హయాంలో MIM కాంగ్రెస్ తో జోడీ కట్టినా.. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక రెండు పార్టీల మధ్య వైరం పెరిగింది. దానికితోడు.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా పదేళ్ళగా పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో.. జనరల్ గా ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి వత్తాసు పలికే MIM.. కేసీఆర్ కే సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా గులాబీ పార్టీతోనే కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ ఓవైసీ.. సర్కార్ పై విమర్శలు కూడా చేశారు.
అందుకే MIMకు ధీటుగా ఎంబీటీని ప్రోత్సహించాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ సీటును ఎంబీటికి కేటాయించాలనే ప్రతిపాదన ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం పెద్దల దృష్టికి వెళ్ళింది. ఇండియా కూటమిలోకి కూడా MBT ని చేర్చుకోబోతోంది. ప్రచార సభలకు ఆ పార్టీ నేతలను ఇన్వైట్ చేయబోతోంది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా MIM పోటీ చేయడం వల్ల బీజేపీకి ఎలా లబ్ది చేకూరుతోంది.. ఆ రెండు పార్టీలు దోస్తీ చేస్తున్నాయని కూడా MBTS తో చెప్పించాలన్నది హస్తం పార్టీ ఆలోచన.

ఎంబీటీతో పొత్తుపై తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ప్రస్తావనకు వచ్చింది. అప్పట్లో AICC పరిశీలకురాలు, ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్ మధ్య 2,3 సార్లు భేటీలు జరిగాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు MBTతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ కి నష్టం జరుగుతుందేమోనని భయపడ్డారు. అందుకే తర్వాత పెట్టుకుందామని డిసైడ్ అయ్యారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఎంబీటీతో జత కలిస్తే.. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అనేక చోట్ల ముస్లిం ఓట్లు తమకే టర్న్ అవుతాయి కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో MIM ను ఎంతో కొంత అడ్డుకోగలిగితే.. రాబోయే రోజుల్లో GHMC ఎన్నికల్లో కాంగ్రెస్, MBTకి మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి.. ఎంబీటీతో ఇప్పుడే పొత్తు పెట్టుకొని ముందుకెళితే బెటర్ అని కొందరు కాంగ్రెస్ సీనియర్లు కూడా సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో MBT సేవలకు రాష్ట్రానికే కాకుండా.. దేశంలో ముస్లింల ప్రభావిత నియోజకవర్గాలకు కూడా విస్తరించే ఛాన్సుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే పాతబస్తీలో కాంగ్రెస్ లీడర్లు కూడా ఎంబీటీతో పొత్తును స్వాగతిస్తున్నారు.