CONG MIM DOST : అక్కడ ఓవైసీ.. ఇక్కడ దానం.. కాంగ్రెస్.. MIM క్విడ్ ప్రో కో
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడం... పవర్ ని ఎంజాయ్ చేయడం MIM ఓవైసీ బ్రదర్స్ కి మొదటి నుంచే అలవాటే. 10యేళ్ళ పాటు BRS కి అంటకాగిన మజ్లిస్ ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్తీకి రెడీ అయింది. అందుకే హైదరాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులంతా అసదుద్దీన్ ఓవైసీకి సపోర్ట్ చేయబోతున్నారు.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడం… పవర్ ని ఎంజాయ్ చేయడం MIM ఓవైసీ బ్రదర్స్ కి మొదటి నుంచే అలవాటే. 10యేళ్ళ పాటు BRS కి అంటకాగిన మజ్లిస్ ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్తీకి రెడీ అయింది. అందుకే హైదరాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులంతా అసదుద్దీన్ ఓవైసీకి సపోర్ట్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. MIMకు హైదరాబాద్ లో సపోర్ట్ ఇస్తే… సికింద్రాబాద్ లో తమకు మద్దతీయాలని ఓవైసీతో రేవంత్ రెడ్డి క్విడ్ ప్రో కో కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డిని ఈసారి ఓడించాలని రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందుకే బీసీ నేత, సిటీలో పట్టున్న దానం నాగేందర్ ను అక్కడ నిల్చొబెట్టారు. గతంలో నాంపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన దానంకు ముస్లిం వర్గాలతో టచ్ ఉంది. ఇప్పుడు MIMతో లోపాయికారి ఒప్పందంతో కిషన్ రెడ్డి ఓడించాలని రేవంత్ టార్గెట్ గా పెట్టుకున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ లో బీజేపీకి 44.84 శాతం ఓట్లు వస్తే… థర్డ్ ప్లేస్ లో నిలిచిన కాంగ్రెస్ కు 19 శాతమే దక్కాయి. ఇప్పటిదాకా సికింద్రాబాద్ కమలానికి కంచుకోట. ఓ రకంగా ప్రత్యర్థి పార్టీల్లో చీలికతోనే అక్కడ కమలం పార్టీ బలపడిందనుకోవాలి. ఈ లోక్ సభ నియోజకవర్గంలో 5 లక్షల మందికి పైగా మైనార్టీల ఓట్లు ఉన్నాయి. సికింద్రాబాద్ లో MIM అభ్యర్థిని నిలబెట్టకపోతే ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ కే పడతాయి. మజ్లిస్ సపోర్ట్ కూడా ఉంటే ఇక పక్కా. అలాగే SC, ST, BC ల ఓటర్లను ఆకర్షిస్తే కాంగ్రెస్ అభ్యర్థి దానం గెలుపు ఈజీ అవుతుందని భావిస్తున్నారు.
సికింద్రాబాద్ లో ఈసారి బీఆర్ఎస్ బలహీనపడటం కాంగ్రెస్ కి కలిసొస్తుందని లెక్కలేసుకుంటున్నారు. సిటీలో గులాబీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచారు. GHMC కార్పొరేటర్ల బలం కూడా ఉంది. దాంతో BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ గెలుపు ఈజీ అవుతుంది. కానీ BRS ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులెవరూ అంత సీరియస్ గా పనిచేయడం లేదన్న టాక్ నడుస్తోంది. ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ లో వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది. మళ్ళీ మోడీయే ప్రధాని అవుతారని సర్వేలు కూడా చెబుతుండటంతో… కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డికి అవకాశం ఉంటుంది. అందుకే ఆయన్ని గెలిపిస్తే బెటర్ అనేది మరికొందరి అభిప్రాయంగా కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్, MIM క్విడ్ కో ప్రో వల్ల… గతంలో లాగా కిషన్ రెడ్డి గెలుపు అంత ఈజీ కాదంటున్నారు.