పడిక్కల్ నయా హిస్టరీ, విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్
దేశవాళీ క్రికెట్ లో కర్ణాటక బ్యాటర్ దేవదూత్ పడిక్కల్ చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లలో అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు.

దేశవాళీ క్రికెట్ లో కర్ణాటక బ్యాటర్ దేవదూత్ పడిక్కల్ చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లలో అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను రుతురాజ్ గైక్వాడ్, మైఖేల్ బెవాన్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ల రికార్డ్‌లను అధిగమించాడు. హర్యానాతో జరిగిన విజయ్ హజారే సెమీస్ మ్యాచ్ తో పడిక్కల్ 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. లిస్ట్ క్రికెట్‌లో పడిక్కల్ యావరేజ్ 82.38గా ఉంది. దాంతో లిస్ట్ క్రికెట్‌లో అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్‌గా పడిక్కల్ నిలిచాడు.ఈ జాబితాలో పడిక్కల్ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ 58.16, మైకేల్ బేవన్ 57.86, విరాట్ కోహ్లీ 57.05, డివిలియర్స్ 53.47 యావరేజ్ తో కొనసాగుతున్నారు.