Chiranjeevi, Padma Vibhushan : నేడు పద్మవిభూషణ్ అందుకోనున్న చిరంజీవి…
టాలీవుడ్ (Tollywood) సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నేడు పద్మవిభూషణ్ (Padmavibhushan) అవార్డును అందుకోనున్నారు.

Padma Vibhushanreceived Padma Vibhushan today...
టాలీవుడ్ (Tollywood) సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నేడు పద్మవిభూషణ్ (Padmavibhushan) అవార్డును అందుకోనున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరిగే ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డును స్వీకరించనున్నారు. నేడు అవార్డును తీసుకోవడానికి చిరంజీవి తన సతీమణి సురేఖ(Surekha), కుమారుడు రామ్ చరణ్ (Power Star Ram Charan), కోడలు ఉపాసన (Upsana) తో కలిసి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.
ఈ సంవత్సరం రిపబ్లిక్ డే రోజున కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మవిభూషష్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.. కాగా చిరంజీవి ఆ అవార్డును ఇప్పటి వరకు అందుకోలేదు. ఈరోజు అవార్డును అందుకోడానికి ఢిల్లీ వెళ్లారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వర్‌రావు (Akkineni Nageshwar Rao) తర్వాత టాలీవుడ్‌లో ఈ అవార్డు అందుకోనున్న రెండవ నటుడు చిరంజీవి నిలిచారు. చిరంజీవికి 2006లో పద్మభూషణ్ అవార్డు (Padma Bhushan Award) కూడా లభించింది.
Suresh SSM